జనసేనని సంచలన నిర్ణయం! త్వరలో పత్రిక ఏర్పాటు

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన ముద్ర వేసేందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు.

 Janasena Chief Pawan Kalyan Plan To Established Newspaper-TeluguStop.com

దీంతో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క సీటుకి జనసేన పార్టీ పరిమితమైపోయింది.ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న జనసేనని మరల తాజాగా తన పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సమీక్షా సమావేశంలో లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జనసేన పార్టీ పక్షాన తమ గొంతు వినిపించేందుకు ఒక పత్రిక కావాలని పవన్ కళ్యాణ్ ప్రకటించి త్వరలో పార్టీ భావజాలాన్ని, ప్రణాళికలను నిర్ణయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కథనాలు అందించేందుకు పత్రిక స్థాపిస్తునట్లు ప్రకటించారు.

మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఈ పత్రిక ఒక వేదిక అవుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేయడం విశేషం.అయితే ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ప్రభావంతో ప్రింట్ మీడియా చాలా వరకు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

ఒకటి రెండు మీడియా సంస్థలు తప్ప చాలా మంది తమ పత్రికలను నడవలేని పరిస్థితిలో ఉన్నారు.ఇలాంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పత్రిక పెట్టాలని తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube