వైరల్: ఏపీలో రోడ్లు ఏంటి ఇలా.. బస్సు చక్రాలు ఏంటి అలా అంటున్న జనసేన నేత..!

ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.ఇప్పుడు అధికారంలో ఉన్న వైస్సార్సీపీ ప్రభుత్వంపై జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేసారు.

 Janasena Chief Pawan Kalyan Over The Roads Situation In Ap, Ap Roads, Bus Tires,-TeluguStop.com

ఏపీలో రోడ్ల పరిస్థితి మరి దారుణంగా ఉందని, ఆ రోడ్ల గురించి అధికార పక్ష నేతలు ఎవ్వరు కూడా సరిగా పట్టించుకోవడం లేదు అంటూ విమర్శించారు.వర్షాకాలం అయితే రోడ్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రోడ్డు సదుపాయం సరిగా లేకపోతే ఇంకా వాహనాలు, బస్సులు ఎలా తిరుగుతాయి చెప్పండి.రోడ్లు సరిగా లేక, వాహనాలు సరిగా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలోని రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

అందులోని ఒక ఫొటోలో అయితే ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయి రోడ్డుపై బస్సు నిలిచిపోయి ఉండడం మనం చూడవచ్చు.ఇలా దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని నాదెండ్ల బస్సు పరిస్థితిపై స్పందించారు.

Telugu Ap Roads, Bus, Bus Wheels, Godavai, Gokavaram, Janasena, Pawan Kalyan, Yc

ఇంతకీ అసలు ఈ రోడ్డు ఎక్కడ ఉంది.బస్ చక్రాలు ఏ రోడ్డుపై ఊడిపోయాయి అనే విషయానికి వస్తే.తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం అనే గ్రామం నుంచి గుర్తేడు పాతకోటకు వెళ్లే రోడ్ మీద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ రోడ్డుపై ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

అక్కడి రోడ్డుఎంత అధ్వాన స్థితిలో ఉందో ఒక్కసారి ఈ ఫోటోలలో చూడండి అంటూ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసారు.ప్రస్తుతం నాదెండ్ల ట్వీట్ చేసిన ఫోటోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

మరి ఈ విషయంపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube