సామజిక సమతూకం పాటిస్తున్న జనసేనాని

తమకు కులం లేదు, మతం లేదు మా దృష్టిలో అందరూ సమానమే అని రాజకీయ నాయకులు చెప్పినా ఓట్ల విషయం దగ్గరకి వచ్చేసరికి ఆ కులాల మద్దతే కీలకం అవుతుంది అన్న విషయం అందరికి బాగా తెలుసు.రాజకీయ నాయకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.

 Janasena Chief Pawan Kalyan Maintains A Social Balance-TeluguStop.com

అందుకే పైకి కులాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్టే కనిపించినా వ్యవహారంలో మాత్రం కులాల ప్రాధాన్యత గుర్తిస్తూ ఆయా సామజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తుంటారు.ఇప్పుడు జననసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ లెక్కల్లోనే బాగా ఆరి తేరెందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైనా మళ్లీ అత్యంత వేగంగా పుంజుకున్నారు.తన కేడర్‌ను, అభిమానులను నిలబెట్టుకోవడంలో ఆయన ముందున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే ఇప్పుడు జనసేనే ప్రధాన ప్రతిపక్షం అన్న రేంజ్ లో పవన్ రాజకీయం నడిపిస్తున్నాడు.నిత్యం ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నాడు.

Telugu Janasenapawan, Pawanvotes-

తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని పవన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగానే సామాజిక వర్గాలకు అతీతంగా రాజకీయాలు, అభివృద్ది నడవాలనే విషయాన్ని ఆయన నొక్కి మరీ చెబుతున్నాడు.పవన్ ను ఎవరు కలిసినా, ఎక్కడ మాట్లాడినా ఏ విషయం మీద ఉద్యమం చేపట్టినా మొట్టమొదట చెప్పేది తనకు ఏ కులమును ఆపాదించొద్దు అని.అయితే, ఏపీలో రాజకీయ కురుక్షేత్రం ఎక్కువగా ఉంది.ఈ నేపథ్యంలో ఎంత కాదనుకున్నాకులాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి.ఈ పరిస్థితుల్లో ఔననలేక కాదనలేక అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే మంచిది కదా అనే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్‌ అమలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ తన సొంత సామాజిక వర్గానికి ఇటవల ఎన్నికల్లో పవన్ ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చాడు.

Telugu Janasenapawan, Pawanvotes-

పవన్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందినా ఆయనకు పడింది మాత్రం కాపు వర్గం ఓట్లే.ఇక మిగిలిన అభ్యర్థుల విషయంలోనూ ఇదే జరిగింది.ఇక జనసేన గెలుచుకున్న రాజోలు నియోజకవర్గంలోనూ కాపు ఓటు బ్యాంకు ప్రభావమే ఎక్కువగా కనిపించింది.

ఇలా కాపులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి పవన్ కు కూడా ఇప్పుడు వచ్చింది.అదే సమయంలో ఎస్సీ ఓటు బ్యాంకు కోసం పవన్ కళ్యాణ్‌ వ్యూహాత్మకంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాయావతి పార్టీ బీఎస్పీని కలుపుకుని ఎన్నికలకు వెళ్లారు.

వేదికలపై మాయావతి పాదాలకు పవన్ కళ్యాణ్‌ మొక్కారు.ఇదంతా ఆ సామజిక వర్గాన్ని తన వైపుకి తిప్పుకోవాలన్న ఆలోచనతోనే.అయితే ఇక్కడ మాత్రం ఆ సామజిక వర్గం ఓట్లన్నీ వైసీపీకి ఎక్కువ పడ్డాయి.ఇక ఇప్పుడు కమ్మ సామజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

అందుకే కొత్తగా పార్టీలోకి వచ్చినా కమ్మ సామజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ కు పవన్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నాడు.అలాగే విశాఖ లాంగ్ మార్చ్ లో కూడా అన్ని సామజిక వర్గాల సమతూకం ఉండేలా పవన్ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube