స్థానిక ఎన్నికలపై జనసేనాని వ్యూహాత్మక అడుగులు  

కార్పోరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Janasena Chief Pawan Kalyan Concentrate On Corporation Elections-janasena Chief Pawan Kalyan,tdp,ysrcp

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిపోయింది. ఇప్పటికే ఏపీ ప్రజలు ఎవరు అధికారంలోకి రావాలి అనే విషయాన్ని డిసైడ్ చేసేసారు. ఇక రిజల్ట్ ప్రకటించడమే ఆలస్యం..

స్థానిక ఎన్నికలపై జనసేనాని వ్యూహాత్మక అడుగులు-Janasena Chief Pawan Kalyan Concentrate On Corporation Elections

అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ పార్టీలు తాము గెలుస్తాం అంటే తాము గెలుస్తాం అని మీడియా ముందుకి వచ్చి హదావిదీ చేస్తే జనసేనాని మాత్రం సైలెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పార్టీ నుంచి కూడా తామే అధికారమ్లొకీ వస్తాం అనే ప్రకటనలు ఎవరు పెద్దగా చేయడం లేదు. ఫలితం ఎలా ఉన్న దానికి స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాలని జనసేన అధినేత ప్రజల్లోకి పంపించారు.

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం ఇప్పుడు అతని ఇమేజ్ ని మరింత పెంచింది అని చెప్పాలి. రెగ్యులర్ రాజకీయ పార్టీలకి భిన్నమైన పంథాలో వెళ్తున్న జనసేన పార్టీతో రాజకీయాలలో సరికొత్త మార్పులు చూడబోతున్నాం అని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఏపీలో పంచాయితీ, పరిషత్, కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ కి రంగం సిద్ధం అయ్యింది.

ఈ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి ఎక్కువ స్థానాలు సొంతం చేసుకొని క్యాడర్ బలం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అందుకుగాను ఇప్పటికే అతను వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకొని పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశ్యం చేసినట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అనేది తెలియాలంటే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూడాల్సిందే.