రైతుల కోసం జనసేనాని నిరాహార దీక్ష... కాకినాడలో వెన్యూ ఫిక్స్

ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత వరుసగా రైతుల సమస్యలని ఎజెండాగా తీసుకొని పర్యటనలు చేస్తున్నారు.ఈ పర్యటనలలో ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ మంచి స్పందన వస్తుంది.

 Janasena Chief Pawan Kalyan Announce Hunger Strike-TeluguStop.com

రైతులు పవన్ కళ్యాణ్ దగ్గరకి వచ్చి వారి సమస్యలని చెప్పుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కూడా రైతులకి అండగా ఉంటా అని భరోసా ఇస్తూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని రైతుల సమస్యలపై పర్యటించారు.అందులో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు.

ఇక రైతులు అందరూ పంట గిట్టుబాటు ధర లేదని, అలాగే దళారులు ఇష్టారాజ్యం దోచేస్తున్నారని, అలాగే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల మాటున కొదొఆ పెద్ద ఎత్తున దందా జరుగుతుందని విన్నవించుకున్నారు.

దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేదంటే ఈనెల 12న కాకినాడలో నిరహారదీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేసారు.100 మంది రైతుల్లో 60 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్నారు.ధాన్యం విక్రయించి 45 రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని మరల ఖరీఫ్ సాగు సమయం వచ్చేసిందని దీనికి ప్రభుత్వం ఈ విధంగా రైతులకి సాయం అందిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.రైతు రక్తమాంసాలు దారాబోసి వ్యవసాయం చేస్తున్న గిట్టుబాటు ధరలు లేక అప్పులు పాలవుతున్నారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.

కులాల వారీగ రైతు భరోసా వర్తించదని కౌలు రైతులని తప్పించడం అంటే కేవలం కక్షపూరిత విధానం అని అన్నారు.రైతుల పొట్ట కొడితే ప్రభుత్వం కూలిపోతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆవేశంగా వ్యాఖ్యలు చేసారు.

మరి పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube