ఏపీ మంత్రికి ప‌వ‌న్ డెడ్‌లైన్‌   Pawan 48hrs Deadline To Minister Kamineni     2017-01-03   00:59:46  IST  Bhanu C

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ మంత్రికి డెడ్‌లైన్ పెట్టారు. ప‌వ‌న్ ఈ రోజు ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్ఛాపురంలోని మ‌ణికంఠ థియేట‌ర్లో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌తో మీట్ అయ్యారు. కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌లు ఏంటో స్వ‌యంగా తెలుసుకున్న ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంతో పాటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి డెడ్‌లైన్ పెట్టారు.

మంత్రి కామినేనికి ప‌వ‌న్ 48 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. ప్ర‌భుత్వం వ‌చ్చే 48 గంట‌ల్లోగా కిడ్నీ వ్యాధి వ‌ల్ల అనాథ‌లైన పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వం ద‌త్త‌త తీసుకుని లేదా వారికి మ‌రో విధంగా సాయం చేయాల‌ని కోరారు. 15 రోజుల్లో ప‌వ‌న్ వీరికి సాయం చేయ‌క‌పోతే దీనిని ఓ ప్ర‌జా ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ‌తాన‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

ఇక్క‌డ కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప‌వ‌న్ ఓ కమిటీని కూడా వేశారు. ఆ క‌మిటీ ఇచ్చే నివేదిక‌ను తానే స్వ‌యంగా ప్ర‌భుత్వానికి అంద‌జేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా త‌న‌కు సాయం చేయాల‌ని ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప‌వ‌న్ కోరారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు బాధితులు తాము నెల‌కు రూ.8 వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని ప‌వ‌న్ ముందు త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరి బాధ‌లు విని చ‌లించిపోయిన ప‌వ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక్క‌డ ఇన్ని సంవత్సరాలుగా ప్ర‌జ‌లు ఈ వ్యాధితో బాధ‌ప‌డుతుంటే ప్ర‌భుత్వం ఎందుకు దీనికి స‌రైన ప‌రిష్కారం క‌నుగోలేక‌పోయిందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌రి ప‌వ‌న్ డెడ్‌లైన్‌కు ఏపీ మంత్రి కామినేనితో పాటు ఏపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

,