బీజేపీ వైసీపీ స్నేహం ! పవన్ కు జరిగే నష్టం ఎంతో ?

వైసీపీ ఎన్డీఏ లో చేరుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, బీజేపీ వైసీపీ స్నేహం అయితే కొనసాగిస్తాయి.ఒకరి అవసరం మరొకరికి ఉండడం, రాజకీయంగా ముందు ముందు చాలా అత్యవసరం కావడంతో, రెండు పార్టీలు తమ రాజకీయ అవసరాల మేరకు స్నేహాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నాయి.

 Janasena Chief Pavan Kalyan Troubled On Bjp Ysrcp Aliance  Tdp, Ysrcp, Janasena-TeluguStop.com

తాజాగా ఈ రోజు ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.వారిద్దరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విషయంపై  ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి.

జగన్ ఢిల్లీ వెళ్లడం,  ప్రధాని మోదీతో భేటీ కావడం వంటి వ్యవహారాలపై వైసీపీ నాయకులకు ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ, టిడిపి జనసేన పార్టీల్లో మాత్రం ఈ వ్యవహారాలపై పూర్తిగా దృష్టి సారించాయి.ఢిల్లీలో జగన్ కదలికలపై పూర్తిగా దృష్టి సారించాయి.

జగన్ ఎవరెవరిని కలుస్తున్నారు.ఏ అంశాలపై  చర్చిస్తున్నారు అనే విషయాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.అనే విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. బీజేపీ వైసీపీ పొత్తు కనుక ఖరారైతే, ఎక్కువగా నష్టపోయేది, రాజకీయంగా ఇబ్బంది పడేది జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన జగన్ పై ఆగ్రహం గానే ఉంటూ వస్తున్నారు.వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పవన్ ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి అని పూర్తిగా పిలిచేందుకు కూడా పవన్ ఇష్టపదారు.కేవలం జగన్ రెడ్డి అంటూ ఆయన కులాన్ని  హైలెట్  చేసేందుకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు.ఏపీ బీజేపీ నాయకులు కొంత కాలం వైసీపీతో సఖ్యతగా ఉన్నాా, ఆ తర్వాత విమర్శలు చేయడం పవన్ కు సంతోషాన్ని కలిగించింది.బీజేపీ జగన్ విషయంలో ఈ విధంగానే ఉండాలని కూడాా పవన్ కోరుకుంటారు.

ఆ మధ్య కేంద్ర బిజెపి పెద్దలు సైతం జగన్ ను పదే పదే పొగుడుతూ, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పడమే కాకుంండా, మూడు రాజధానుల  అంశానికి పరోక్షంగా మద్దతు పలకడం, పవన్ కు కొంతకాలంగా ఆగ్రహం కలిగిస్తున్నాయి.

Telugu Aliance, Ap Politicle, Jagan, Janasena, Modhi, Pavan, Pawankalyan, Ysrcp-

ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకుని జగన్ విషయంలో సానుకూలంగా ఉండడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇదిలా ఉంటే జగన్ ఢిల్లీ టూర్ లో పొత్తు విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో,  పవన్ ఇప్పుడు ఏ రకమైన స్టెప్ తీసుకోవాలనేది అర్థంకాని పరిస్థితి. జగన్ తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా, లేక మిత్రుత్వం కొనసాగించినా, పవన్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో సఖ్యతగా మెలగలేని పరిస్థితి.2024లో తన కల నెరవేర్చుకోవాలి అంటే అది బీజేపీతో మాత్రమే సాధ్యం అనేది పవన్ కు బాగా తెలుసు.ఒకవేళ బీజేపీ అండదండలు తమకు లేదని తెలిస్తే, తెలుగుదేశం పార్టీకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో, అదే పరిస్థితి వస్తుందని, రాజకీయంగా అణగతొక్కేందుకు జగన్ తప్పక ప్రయత్నిస్తారు అనేది పవన్ కు బాగా తెలుసు .

అయితే అప్పటి వరకు జగన్ పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చినా, పవన్ ఇప్పుడు బీజేపీతో పొత్తు వైసిపి పెట్టుకుంటే తమకు కూడా వైసీపీ ఉంటుంది.ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడదు అనే ఆలోచనలో  సతమతమవుతున్నారు.

ఏది ఏమైనా బీజేపీ వైసీపీల వైకిరిపై మాత్రం పవన్ కు ఆగ్రహం, ఆవేశం, ఆందోళన, అనుమానాలు అన్నిటినీ కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube