ముగిసిన 'సేనాని' రైలు ప్రయాణం !  

Janasena Chief Pavan Kalyan Train Journy Completed Succsefully-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన ‘సేనానితో రైలు ప్రయాణం’ ముగిసింది.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైలు యాత్ర జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు.తుని వరకు ప్రయాణం సాగించిన పవన్‌కు అక్కడ అభిమానులు ఘనస్వాగతం చెప్పారు.పవన్ కూడా ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు చాలా ఉత్సాహంగా కనిపించారు..

Janasena Chief Pavan Kalyan Train Journy Completed Succsefully--Janasena Chief Pavan Kalyan Train Journy Completed Succsefully-

రైలు ప్రయాణంలో భాగంగా ఈ మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్‌కు వచ్చిన పవన్‌కు రైల్వే కూలీలు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పవన్ రైలులో చిరు వ్యాపారులను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైలు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం మీదగా సాయంత్రం తుని చేరుకున్నారు.ఈ రైలు యాత్ర అనుకున్నట్టుగానే సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో జనసేన వర్గాలు ఆనందంలో ఉన్నాయి.