జమిలి ఎన్నికల పై పవన్ సంచలన ప్రకటన ? బీజేపీ లీక్ చేసిందా ?  

Janasena chief pavan Kalyan sensational comments on jamili elections issue, amravathi, ap, bjp, chandrababu, jagan, jamili elections, janasena, leaders, mangalagiri, pawan kalyan, tdp, ysrcp - Telugu Amravati, Ap, Bjp, Chandrababu, Jagan, Jamili Elections, Janasena, Pawan Kalyan, Tdp, Ysrcp

రాజకీయంగా ఏపీ పెద్దగా బలం లేకపోయినా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగానే అన్ని విషయాల పైన స్పందిస్తున్నారు.ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో పవన్ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా, ముందుకు దూసుకెళ్తున్నారు.

TeluguStop.com - Janasena Chief Pavan Kalyan Sensational Comments On Jamili Elections Issue

చాలా కాలంగా ఆయన ఏపీలో అడుగు పెట్టక పోవడం, అనేక ప్రజా సమస్యల విషయంలో జనసేన పెద్దగా స్పందించడం లేదని, విమర్శలు పెద్దగా వస్తున్న నేపథ్యంలో, పవన్ అమరావతిలో రెండు రోజులపాటు సమీక్షా సమావేశాలు నిర్వహించడం తో పాటు, అమరావతి ఉద్యమకారుల తోనూ చర్చించారు.ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.

2024 కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు తనకు సమాచారం ఉంది అంటూ పవన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

TeluguStop.com - జమిలి ఎన్నికల పై పవన్ సంచలన ప్రకటన బీజేపీ లీక్ చేసిందా -Political-Telugu Tollywood Photo Image
Telugu Amravati, Ap, Bjp, Chandrababu, Jagan, Jamili Elections, Janasena, Pawan Kalyan, Tdp, Ysrcp-Telugu Political News

దేశం అంతా ఒకేసారి ఎన్నికలు రావాలనేది నా అభిప్రాయంగా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.వివిధ రాష్ట్రాలు సైతం ఇదే కోరుకుంటున్నాయని, పవన్ చెబుతున్నారు.ముందుగా ఎన్నికలు రావాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటూ రావడం అనేది సహజమేనని పవన్ చెప్పుకొచ్చారు.

అయితే పవన్ ఈ వ్యాఖ్యలు ఆషామాషీగా అయితే చేయలేదని , ఖచ్చితంగా ఆయనకు సమాచారం ఉంది కాబట్టే, ఈ విధమైన ప్రకటన చేశారనీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కేంద్రం సైతం చాలాకాలంగా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోందని ,ఈ మేరకు లీకులు ఇస్తోందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.2022లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన ఉందని, ఆ ఏడాది దాదాపు 8 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పాటు, 2021లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

దీనిని దృష్టిలో పెట్టుకుని దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇక పవన్ తో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జమిలి ఎన్నికలపై పదేపదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ విధమైన ప్రకటన చేయడం చూస్తుంటే, అనేక అనుమానాలను కలిగిస్తోంది.

బిజెపి నిజంగా నా ఉద్దేశంలో ఉందా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.

#Janasena #Amravati #Pawan Kalyan #Ysrcp #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Chief Pavan Kalyan Sensational Comments On Jamili Elections Issue Related Telugu News,Photos/Pics,Images..