చిరు పై పవన్ సంచలన కామెంట్స్ ? 

సొంత అన్నదమ్ములైనా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నారు.చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండగా, పవన్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Janasena Chief Pavan Kalyan Sensational Comments On Chiranjivi, Chirenjeevi, Meg-TeluguStop.com

ప్రజారాజ్యం పార్టీ ద్వారా, తన అన్న చిరంజీవి సాధించలేని సీఎం పీఠాన్ని జనసేన ద్వారా తాను సాధించాలి అనే పట్టుదలతో పవన్ ఉన్నారు.ఇదిలా ఉంటే , తాజాగా చిరంజీవి పై పవన్ సంచలన కామెంట్స్ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం పవన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో జనసేన అభ్యర్థి ని బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే చిరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” చిరంజీవి లాంటి బలమైన వ్యక్తి పార్టీ పెడితే తిరుపతి సభకు 10 లక్షల మంది వచ్చారు.అలాంటి వ్యక్తిని కూడా నిలబెట్టుకోలేకపోయాము.ఆయన గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి బలమైన ముఖ్యమంత్రిని చూసేవాళ్ళం ” అంటూ చిరు అంశాన్ని పవన్ లేవనెత్తారు.రాజకీయాల్లో ఆశయ బలం ఉండాలని, అది ఉన్నవారికి ఓటమి కుంగుబాటు ఇవ్వదు అని చెప్పిన పవన్ చిరంజీవి ఇప్పటివరకు రాజకీయాలలో కొనసాగి ఉంటే తప్పనిసరిగా సీఎం అయ్యేవారు అంటూ చెప్పారు.ప్రస్తుత వైసీపీలో మంత్రులుగా ఉన్న చాలా మంది చిరంజీవి దగ్గరకు ఎలా వచ్చే వారో తనకు బాగా తెలుసునని ,  పరోక్షంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Telugu Chirenjeevi, Janasena, Pavan Kalyan, Prajarsjyam, Tirupathi, Ysrcp-Politi

జనసేన పార్టీ స్థాపించిన తరువాత చిరు అంశాన్ని పెద్దగా ఎక్కడ ప్రస్తావించని పవన్ ఇప్పుడు మాత్రం చిరు అంశాన్ని హైలెట్ చేసుకోవడం వెనుక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలే కారణం అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు చూస్తుండగా, జనసేన సైతం ఇక్కడ పోటీ చేయాలని చూస్తోంది.ఈ విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ రాకపోయినా , తమ బలం  నిరూపించుకుని బిజెపి ని  ఒప్పించేందుకు ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జిల్లాలో పర్యటిస్తూ బలనిరూపణకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు గా వ్యవహరిస్తున్నారు.

 ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ప్రయత్నించినా, బీజేపీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు.

ఇప్పుడు దానికి బదులుగా తిరుపతి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని జనసేనకు ఇవ్వాలనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు చిరు అభిమానులను కూడా కలుపుకుని ఈ పార్లమెంట్ ఎన్నికలలో జనసేన అభ్యర్థి విజయం సాధించాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు గా అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube