జగన్ కొంతమందికే సీఎం అంటున్న పవన్  

Janasena Chief Pavan Kalyan Slams Ap Cm Jagan-

జగన్ పాలనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తే మాత్రం అందరూ ఆసక్తిగా వాటి గురించి చర్చించుకుంటారు.పవన్ కూడా అదేవిధంగా జగన్ పై ప్రతి విషయంలోనూ స్పందిస్తూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు.నిత్యం ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు పవన్ ప్రశ్నిస్తున్నాడు.తాజాగా జగన్ పై పవన్ విమర్శలు చేశారు.

Janasena Chief Pavan Kalyan Slams Ap Cm Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Janasena Chief Pavan Kalyan Slams Ap Cm Jagan--Janasena Chief Pavan Kalyan Slams Ap Cm Jagan-

ఆయన కొంతమందికి మాత్రమే సీఎం అని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు ఆయన్నుపేరు పెట్టి మాత్రమే పిలుస్తానని పవన్ చెబుతుండడం సంచలనంగా మారింది.రైల్వే కోడూరు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పూర్తిగా ప్రత్యేక హోదా విషయం మర్చిపోయిందని , మాయమాటలు చెప్పి అధికారాన్ని సంపాదించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైసీపీకి లేదని పవన్ చెప్పారు.ఆశయం కోసం పనిచేస్తే పదవులు అక్కర్లేదని, అందుకే తాను ఓటమి చెందినా ప్రజల్లోనే తిరుగుతున్నాని చెప్పారు.

జగన్‌కు భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని పవన్ ప్రశ్నించారు.జగన్ తనకు గౌరవం ఇచ్చి మాట్లాడితే తాను కూడా గౌరవంగా మాట్లాడుతానని అప్పటివరకు జగన్ ను ఇలాగే పిలుస్తానని పవన్ చెప్పారు.