జనసేనానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తల్లి     2018-10-30   19:57:22  IST  Sai Mallula

జనసేనక్ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆయన తల్లి అంజనాదేవి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అకస్మాత్తుగా జనసేన కార్యాలయానికి వెళ్లిన ఆమె జనసేన పార్టీకి తన వంతు సహాయంగా… 4లక్షల రూపాయల చెక్కుని పవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తన తల్లి పాదాలను మొక్కిన పవన్, ఆమె ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించారు.

Janasena Cheif Pawan Kalyan Mother Donation To Janasena-

Janasena Cheif Pawan Kalyan Mother Donation To Janasena

ఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో అంజనాదేవి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్‌ను అంజనాదేవి కోరారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.