ఎన్టీఆర్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు ... వైరల్ !     2019-01-11   00:20:42  IST  Sai Mallula

జనం నోట్లలో బాగా నానడం ద్వారా ఈ ఎన్నికల్లో సులువుగా గెలుపొందవచ్చు అనే ఆలోచనతో..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుందూకుగా.. ముందుకు వెళ్తున్నారు. దీని కారణంగానే..తనకు రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వారందరిని టార్గెట్ గా చేసుకుని వారి మీద సంచలన ఆరోపణనలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా…మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ లా తాను అహంకారాన్ని తలకెక్కించుకోనని పవన్ చెప్పారు.

Janasena Cheif Pavan Sensatinol Coments On Ntr-

Janasena Cheif Pavan Sensatinol Coments On Ntr

‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.