పవన్ వార్నింగ్ : జేసీ ప్రభార్ రెడ్డి... రోజులు మారాయ్  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు మరింత పెంచారు. ఒక పక్క వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని మరీ విమర్శలు గుప్పిస్తూనే… రాజకీయాల్లో పాతుకుపోయి … కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నబలమైన టీడీపీ నాయకులను పవన్ టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ విధంగానే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ ను పవన్ టార్గెట్ చేసుకున్నాడు. ఇప్పుడు అనంతపురం రాజకీయాలను శాసిస్తూ… తిరుగులేని నాయకులుగా ఉన్న జేసీ బ్రదర్స్ లో ఒక బ్రదర్ ను పవన్ టార్గెట్ గా చేసుకున్నాడు.

Janasena Cheif Pavan Kalyan Warning To Jc Dhivkar Reddy-

Janasena Cheif Pavan Kalyan Warning To Jc Dhivkar Reddy

‘ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డీ..! ఫ్యాక్షన్‌ రాజకీయాలతో భయపెట్టాలని చూడొద్దు. పోలీసులు, ఇతర అధికారులను ఎంతమందిని భయపెడతారు. ఎంత మందిని చంపుతారు. ఎంతమందిపై బాంబులేస్తారు. రోజులు మారాయి. పాతతరం లాగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. జనసేన అసలే ఊరుకోదు. సీమలో అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయింది. ఇది బాధకలిగించే అంశం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేదిలేదు. ఆ ప్రజలకు జనసేన అండగా ఉంటుంది. జనసేన సైనికులపైనా కేసులు పెట్టి ఇబ్బందులు కలిగించాలని చూస్తే ఊరుకోం.. జాగ్రత్త.’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యక్షంగా పవన్‌ హెచ్చరించారు.