తెలంగాణ ఎన్నికలపై పవన్ ట్విట్ !  

ఒకపక్క చూస్తే తెలంగాణ ఎన్నికలు పోలింగ్ తేదీ ముంచుకొచ్చేస్తోంది. ఈ సమయంలో ఏపీలో పోటీకి సిద్ధం అవుతున్న జనసేన పార్టీ మద్దతు తెలంగాణాలో ఏ పార్టీకి ఉండబోతోంది అనేది అందరికి ఆసక్తి నెలకొంది. కానీ పవన్ సూటిగా ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాడు అనేది ఎవరికీ తెలియలేదు. ఈ సస్పెన్సు ఇలా కొనసాగుతుండగానే పవన్ తాజాగా తన అభిప్రాయాన్ని 5వ తేదీన ప్రకటిస్తానని ట్విట్టర్లో ప్రకటించారు.

Janasena Cheif Pavan Kalyan Twit On Telangana Elections-

Janasena Cheif Pavan Kalyan Twit On Telangana Elections

పవన్ ట్విట్ ఈ విధంగా ఉంది. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపధ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తాము..’