రైలు యాత్ర తో జనంలోకి పవన్ ! అభిమానులు ఏం చేయాలంటే..?

తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లేందుకు వినూత్నంగా ప్లాన్ చేశారు.జనంతో మమేకం అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా… ఆయన రైలు ప్రయాణం చేయబోతున్నారు.

 Janasena Cheif Pavan Kalyan Train Journy To Tuni-TeluguStop.com

శుక్రవారం (నవంబర్2న) రైలు యాత్ర చేయనున్నారు.విజయవాడ నుంచి తుని వరకు ఆయన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో జనంతో కలిసి రైల్లో ప్రయాణించబోతున్నారు.

ఈ విషయాన్ని జనసేన పార్టీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ జర్నీకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసింది.శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు విజయవాడలో పవన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరతారు.సాయంత్రం 5.20నిమిషాలకు తుని రైల్వే స్టేషన్‌లో దిగుతారు.ఈ ప్రయాణంలో ప్రజా సమస్యలు, జనసేన పార్టీ ఆశయాలకు ప్రయాణికులకు వివరిస్తారు.పవన్ రైలు యాత్ర నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలకు జనసేన పార్టీ పలు సూచనలు చేసింది.

విజయవాడ నుంచి తుని వరకూ వివిధ స్టేషన్‌లో పవన్‌కు శుభాకంక్షలు తెలిపేందుకు వచ్చే వాళ్లు విధిగా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుని, వాటిని బ్యాడ్జిలుగా ధరించి రావాలని సూచించారు.అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో పాటు రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube