జగన్ లా చంపేయండి ... చింపెయ్యండి అని నేను అనను  

Janasena Cheif Pavan Kalyan Sensational Coments To Jagan-

వైసీపీ అధినేత జగన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్‌లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ ఎప్పుడూ మాట్లాడలేదని… . ‘నేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించానని’ స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడో పక్షంగా జనసేనను స్థాపించానని వివరించారు.

Janasena Cheif Pavan Kalyan Sensational Coments To Jagan-

Janasena Cheif Pavan Kalyan Sensational Coments To Jagan

రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్‌ మ్యాన్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టినట్లు తెలిపారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కానీ రాజకీయాలు తనకు వ్యాపారం కాదని పేర్కొన్నారు. అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి.