గొంతు కోసిస్తా అంటున్న పవన్ ... ఇంతకీ ఎందుకు ...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వ్యవవస్థల్లో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు జనసేనకు మీరంతా ఓటు వేయాలని ఆయన కోరారు.

 Janasena Cheif Pavan Kalyan Sankranti Celebrations At Tenali-TeluguStop.com

మీరు ఓటు వేస్తే గొంతు కోసి ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు పవన్ ప్రకటించారు.ప్రస్తుతఘం ఎక్కడ చూసినా… అవినీతి అనేది సర్వసాధారణంగా మారిపోయిందన్నారు.

ఆ అవినీతిని భోగి మంటల్లో కాల్చేద్దామని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.అవినీతిలో కూరుకుపోయిన నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ప్రజలు, యువత వారిని ప్రశ్నించాలని కోరారు.

అవినీతి నాయకులకు ఓట్లు వేయకుండా వ్యతిరేకించాలని పవన్ పిలుపునిచ్చారు.తనకు ఓటేసి గెలిపిస్తే మెడ కోసి ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించారు.రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం, వైకాపలు రెండు విఫలమయ్యాయని పవన్ ఆరోపించారు.త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని చెప్పారు.ఫిబ్రవరి రెండో వారంలో స్పష్టత ఇస్తామని పవన్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube