జనసేనాని పోరాట యాత్ర షెడ్యూల్ ఫిక్స్ ! ఎప్పటి నుంచి అంటే..?   Janasena Cheif Pavan Kalyan Porata Yathra Sheduel Fix     2018-10-30   21:29:28  IST  Sai M

కొంతకాలం విరామం తరువాత జనసేనాని పోరాట యాత్ర మళ్ళీ మొదలు కాబోతోంది. శ్రీకాకుళం తుఫాన్ బాధితులను పరామర్శించిన తరువాత హైడెరాబ్యాడ్ కే పవన్ పరిమితం అయ్యాడు. తాజాగా… తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి తుని పట్టణం నుంచి పవన్ పోరాటయాత్ర ప్రారంభమవుతుంది.

ఆ రోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. తదుపరి ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. కత్తిపూడి జంక్షన్‌లో బహిరంగ సభ ఉంటుంది. 4వ తేదీ ఉదయం వంతాడలో లేటరైట్ కార్మికులతో సమావేశం, రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన కాకినాడలో పారిశుధ్య కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. సా.4 గంటలకు పెద్దాపురంలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగిస్తారు. అనంతరం పెద్దాపురం ప్రజలతో సమావేశమవుతారు.

Janasena Cheif Pavan Kalyan Porata Yathra Sheduel Fix-

6వ తేదీన కాకినాడ ఎస్.ఈ.జడ్. నిర్వాసితులు, రైతులు పవన్‌ని కలిసి తమ సమస్యలు వివరిస్తారు. ఆ రోజు సా.4 గంటలకు పిఠాపురంలో బహిరంగ సభ ఉంటుంది. 7వ తేదీన షెడ్యూల్ కులాల ప్రజలతో సమావేశం ఉంటుంది. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నగరంలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగిస్తారు.