పవన్ ఆ.. నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడా...?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే… ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయాలపైనా గత కొంతకాలంగా… అనేక అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కూడా చేరిపోయింది. శ్రీపాద వల్లభుడంటే నాకెంతో ఇష్టం, ప్రేమ, గౌరవం. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో..’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Janasena Cheif Pavan Kalyan About Contesting From Pithapuram-

Janasena Cheif Pavan Kalyan About Contesting From Pithapuram

పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని చెప్పారు. తనను మత్స్యకారులు అడుగుతుంటే పిఠాపురం ప్రత్యేకత ఏమిటో తనకు అర్థంకాలేదని, ఆ తర్వాత ఇక్కడి ప్రత్యేకత శ్రీపాద వల్లభుడేనని అర్థమైందన్నారు. ఐతే.. ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తనది కాదని, సెలక్షన్‌ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అనంతపురం, ఇచ్ఛాపురం నుంచి కూడా తనను పోటీచేయాలని కోరుతున్నారని అయితే ఎక్కడ పోటీ చేయాలనే ఇంకా క్లారిటీ రాలేదని పవన్ చెప్పుకొచ్చారు.