అన్నా రాంబాబు కి జనసేన సవాల్..!!  

janasena, pawan kalyan, giddaluru,anna ram babu,janasena leader pawan kalyan fires on anna ram babu - Telugu Anna Ram Babu, Giddaluru, Janasena, Janasena Leader Pawan Kalyan Fires On Anna Ram Babu, Pawan Kalyan

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వలన జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వెంగయ్య మరణించినట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే.ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు వెంగయ్య ని చిత్ర వధలకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Janasena Challenge To Anna Rambabu

అంతేకాకుండా అన్నా రాంబాబు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునే రీతిలో వ్యవహారం ఉంటుందని పవన్ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో తన పై పవన్ చేసిన వ్యాఖ్యలపై అన్నా రాంబాబు స్పందిస్తూ వెంగయ్య మృతికి తనకు ఎటువంటి సంబంధం లేదని వ్యక్తిగత కారణాలతోనే అతను చనిపోవడం జరిగింది అని పేర్కొన్నారు.

శవ రాజకీయాలు చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని, దమ్ముంటే తనపై పోటీ చేసి ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ కూడా విసిరారు.ఒకవేళ ఎన్నికల్లో తాను ఓడిపోతే ఎలాంటి శిక్షకైనా రెడీ అని, పవన్ ఓడిపోతే జనసేన పార్టీ మూసేస్తారా అనే సవాల్ విసిరారు.

TeluguStop.com - అన్నా రాంబాబు కి జనసేన సవాల్..-Political-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో జనసేన పార్టీ క్యాడర్ అన్నా రాంబాబు చేసిన సవాల్ కి ప్రతి సవాల్ రెడీ చేసింది.వెంగయ్య భార్య పోటీకి దిగుతుందని ఆమెపై నువ్వు పోటీ కి రెడీ అయిన ఎన్నికలకు వస్తావా అంటూ అన్నా రాంబాబు కి సంచలన సవాల్ విసిరారు.

నీకు పవన్ దాకా అవసరం లేదు చనిపోయిన జనసేన పార్టీ కార్యకర్త భార్య పై పోటీకి దిగాలని సవాల్ విసురుతున్నారు.మరి జనసేన సవాల్ విషయంలో అన్నా రాంబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

#Pawan Kalyan #Giddaluru #Anna Ram Babu #JanasenaLeader #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు