జనసేన కాన్ఫిడెన్స్ మరీ ఓవర్ అవుతోందా ?

ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ చర్చలకు ముగింపు మాత్రం రావడంలేదు.ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు తమదంటే తమదని చెబుతూ మెజార్టీ సీట్లు తామే సాధించబోతున్నాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్నాయి.

 Janasena Candidates Over Confidence On Winning Elections-TeluguStop.com

వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ అనేక సర్వే సంస్థలు కోడై కూశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఈవీఎం మిషన్ లలో అనేక అక్రమాలు జరిగిపోయాయయని, బీజేపీ ఎన్నికల కమిషన్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది అని ఆరోపణలు గుప్పిస్తూనే 140 నుంచి 150 సీట్లు గెలవబోతున్నాం అంటూ చెబుతున్నాడు.

ఇక మిగిలిన ప్రధాన పోటీదారు జనసేన గురించి మాట్లాడేవారే కరువయ్యారు.జనసేన ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రమే అని ఫలితం ముందే తేల్చేశారు.
అంతే కాదు సాక్ష్యాత్తు ఆ పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ, విశాఖ జిల్లా గాజువాక లోనూ పవన్ ఓటమి చెందుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలయ్యింది.ఇక మిగతాచోట్ల కూడా పోటీచేసిన అభ్యర్థుల గురించి అయితే చెప్పనవసరంలేదు.

గెలుపు పై పెద్దగా ఎవరికీ ధీమా అయితే రాలేదు.కానీ జనసైనికులు మాత్రం మీరు చూస్తూ ఉండండి ఏపీలో నిశబ్ద విప్లవం వచ్చేస్తుంది.

జనసేన అధికారంలోకి రావడం పక్క , పవన్ సీఎం సీట్లో కూర్చోవడం గ్యారంటీ అంటూ హడావుడి చేస్తున్నారు.

పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జనసేన అభ్యర్థులు, ఆ పార్టీ కీలక నాయకులు పదే పదే జనసేన అధికారంలోకి రాబోతుంది అనే మాటనే చెప్తూ వస్తున్నారు.

వివిధ నియోజకవర్గాల్లో నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ఈ మాటలే చెప్తున్నారు.అలాగే ప్రతి సమావేశం తర్వాత వివరాలతో కూడిన ఓ ప్రెస్ నోట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అందులో ఉన్న అంశాలు ఏంటి అంటే, ఏపీలో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవం ఉంది, ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గట్టిగా ప్రభావం చూపించబోతున్నాం అంటూ జనసేన కీలక నాయకులు వ్యాఖ్యానించడం అందరికి ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube