జనసేన బీజేపీ ఎందుకిలా ?

ఎవరు తగ్గట్లే.! ఎవరికి వారు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు అనే విషయాలలో తమదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.

 Janasena Bjp Party Diffrent Ways On Ap, #nivar, Ap, Bjp, Elections, Jagan, Janas-TeluguStop.com

తమ ఉనికిని చాటుకోవడానికి ఇదే సరైన సమయంగా అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆందోళనలో ఉన్నారు.

ఇవన్నీ బిజెపి – జనసేన పార్టీలు ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్న అంశాలు.అందుకే ఈ రెండు పార్టీలు తమ మధ్య పొత్తు ఉన్నా, దానిని కూడా మరిచిపోయి మరీ ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు విడివిడిగా ప్రజా పోరాటాలను ఉద్యమాలను చేపడుతూ ముందుకు వెళ్తున్నాయి.

వాస్తవంగా అయితే జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంది.దాని ఆధారంగా చేసుకుని రెండు పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికల ప్రచారానికి దిగి విజయాన్ని సొంతం చేసుకోవాల్సి  ఉన్నా, అవేమీ పట్టనట్టుగానే బిజెపి జనసేన వ్యవహరిస్తున్నాయి.

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కృష్ణ, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన ఇప్పుడు రైతుల కోసం ఒకరోజు దీక్ష చేపట్టారు.

అయితే ఈ విషయంలో బీజేపీ ని కలుపుకుని వెళ్లేందుకు పవన్ ఇష్టపడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Telugu Nivar, Jagan, Janasena, Tirupathi, Tufan-Telugu Political News

బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నా, పవన్ ఏపీలో ఒంటరిగానే బలం పెంచుకునే విషయంపై దృష్టి పెట్టారు.ఇక బిజెపి రోడ్ల దుస్థితిపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.కానీ ఆ ఆందోళన కార్యక్రమాలకు జనసేన ను పిలవకపోవడం కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తంతే కారణంగా కనిపిస్తోంది.

ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టి విషయంలో జనసేన బీజేపీలకు మధ్య సఖ్యత లేకపోవడం, ఎవరికి వారు ఇక్కడ పోటీ చేసేందుకు తహతహలాడుతున్న తీరు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న బిజెపి జనసేన పార్టీల విడివిడిగానే ప్రస్తుతానికి ముందుకు వెళ్తున్నాయి.

 తిరుపతి ఉప ఎన్నికలలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కాకపోతే ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో కిందిస్థాయి కార్యకర్తలు అయోమయం నెలకొనడంతో పాటు జనసేన బీజేపీ ల పొత్తు విషయమై జనల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube