జనసేన బిజెపి పొత్తు: జగన్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందా ?

ఏపీలో ఇప్పుడు అనేక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలని ఎప్పటి నుంచో కలలుకంటున్న బిజెపి ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీతో కలిసి ముందుకు వెళ్తోంది.

 Janasena Bjp Alliance Is It Possible With Jagans Decision-TeluguStop.com

ఎన్నికల తరువాత కొద్దికాలాని కే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం బీజేపీకి అలవాటుగా వస్తోంది.ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి బిజెపి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది.

ఆ పార్టీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు బిజెపి జగన్ కు ఆవిధంగా మద్దతు తెలిపింది.అయితే అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలల్లోనే వైసీపీతో తమకు సంబంధం లేదన్నట్లుగా ఆ పార్టీ మాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉంది అన్నట్టుగా బిజెపి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తోంది.

Telugu Apcm, Bjpkanna, Janasena Bjp, Janasenabjp, Janasenapawan-

ఇక ఇప్పుడు జనసేన పార్టీతో బిజెపి కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యింది.అసలు జనసేన, బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో జరగబోతున్న నేపథ్యంలో బిజెపి జనసేన కలిసి ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాయి.ఏ విషయాన్ని బిజెపి, జనసేన పెద్దలు స్వయంగా ప్రకటించారు.

ఎన్నికల్లో పొత్తులు అయినా, ప్రభుత్వంపై పోరాటం అయినా ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి.దీనికోసం ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని నియమించుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామని ప్రకటించాయి.

Telugu Apcm, Bjpkanna, Janasena Bjp, Janasenabjp, Janasenapawan-

వైసీపీతో తమకు ఎటువంటి రాజకీయ పొత్తులు లేవని, ఇకపై ఉండదు అంటూ బిజెపి ప్రకటించింది.ఇకపై రాజధాని వ్యవహారం పైనే కాకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నిటిపైన తాము కలిసి పోరాడుతామని ప్రకటించాయి.అంటే ఇప్పుడు అమరావతి రాజధాని వ్యవహారం నుంచే ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.అసలు జనసేన, బిజెపి పొత్తు పెట్టుకోవడానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే కారణంగా కనిపిస్తోంది.

ప్రజలు వ్యతిరేకిస్తున్నా రాజధాని విషయంలో జగన్ వెనక్కి తగ్గకపోవడంతో పాటు, కేంద్రం ఈ విషయంలో ఆగ్రహంగా ఉందని తెలిసినా జగన్ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడంపై బిజెపి కొంతకాలంగా ఆగ్రహంగా ఉంది.అందుకే జగన్ హవాను అడ్డుకునే క్రమంలో జనసేన తో కలిసి ముందుకు వెళ్లడం ద్వారా అటు జగన్ కంట్రోల్ చేయడంతోపాటు, ఏపీ లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube