టీడీపీ- జనసేన పొత్తు ...? క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎంపీ !

టీడీపీ – జనసేన రెండు పార్టీలు ఒక వారిలోని కత్తులేనని, గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన జనసేన ఈ ఎన్నికల్లో కూడా… ఆయా పార్టీతో కలిసే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని… మొదటి నుంచీ ….వైసీపీ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది.

 Janasena And Tdp Tie Up Will Conformed By The Tdp Mp-TeluguStop.com

అంతే కాదు… ఇదే విషయమై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది.అయితే ఈ వాదనలు కేవలం రాజకీయ విమర్శలే అని అంతా అనుకుంటున్నారు.

ఇక జనసేన కూడా… ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తోంది.తాము ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడంలేదని… ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్నామని చెప్పుకుంటూ వస్తోంది.

కానీ ఇదే సమయంలో ….టీడీపీ పై విమర్శలు చేయడం బాగా తగ్గించింది.

ఇక టీడీపీ కూడా జనసేన విషయంలో ఇలాగే చేస్తోంది.

ఈ ఎత్తులు పొత్తులు ఇలా కొనసాగుతుండగానే….టీడీపీతో జనసేన కలవబోతోందని… ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల సమరంలోకి వెళ్లి ఆ తరువాత కలిసి అధికారంలో రావాలని చూస్తున్నాయని అర్ధం అవుతోంది.తాజాగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఇదే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ కల్యాణ్- టీడీపీ కలిస్తే జగన్‌కు ఏంటి బాధ అని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా….టీజీ వెంకటేశ్‌ మరో అడుగు ముందుకేశారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని చెప్పారు.పొత్తుకు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు.

మార్చిలో చర్చలు జరుగుతాయన్నారు.చర్చలంటే సీట్ల సర్దుబాటు కోసమే అంటూ కూడా టీజీ క్లారిటీ ఇచ్చేసాడు.

అసలు తమ పవన్‌ కల్యాణ్‌కు ఎటువంటి శత్రుత్వం లేదని… కేవలం కేంద్ర ప్రభుత్వం వైఖరి విషయంలోనే చంద్రబాబు, పవన్‌ మధ్య విభేదాలు వచ్చాయన్నారు.కేంద్రంపై చంద్రబాబు గట్టిగా పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది అన్నది పవన్ కల్యాణ్ అభిప్రాయం అని.ఇప్పుడు ఎలాగూ చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా రెండు పార్టీలు కలవడానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని కూడా సదరు టీడీపీ ఎంపీ గారు క్లారిటీ గా చెప్పేస్తున్నారు.

అంతే కాదు యూపీలో బద్ధ శత్రులవులైన ఎస్పీ బీఎస్పీలు కలవగా లేనిది టీడీపీ జనసేన కలిస్తే తప్పేముంది అనే లాజిక్ కూడా టీజీ చెప్తున్నాడు.అంతేకాదు కేంద్రంలో బీజేపీ రాకుండా ఉండాలంటే ఇక్కడ తాము కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందంటున్నటున్నాడు.టీజీ మాటలను బట్టి చూస్తే… ఈ రెండు పార్టీల మధ్య నిజంగా అటువంటి ప్రతిపాదనలు జరుగుతున్నాయేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube