గ్రౌండ్ లెవ‌ల్ లో జ‌న‌సేన దూకుడు.. ప‌వ‌న్ ప‌ట్టించుకుంటే వేరే లెవ‌ల్

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సినిమాల ప‌రంగా ఉన్న ఇమేజ్ పొలిటిక‌ల్ ప‌రంగా ఇంకా రావ‌ట్లేదు.ఆయ‌న వ్యూహాలు ఒక్కోసారి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి.

 Janasena Aggression On The Ground Level. A Different Level If Pawan Care About P-TeluguStop.com

నిజం చెప్పాలంటే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లే ఆయ‌న తీరుతో షాక్ అవుతుంటారు.మొద‌టి నుంచి ప‌వ‌న్ దూకుడు రాజ‌కీయాలు చేయ‌ట్లేదు.

ఏదో వ‌చ్చామా అంటే వ‌చ్చాం అన్న‌ట్టు ఉంటున్నారు త‌ప్ప పెద్ద‌గా ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌ట్లేదు.కానీ జ‌న‌సైనికులు మాత్రం ప‌వ‌న్ మీద పార్టీమీద బాగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ప‌వ‌న్ నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు రాక‌పోయినా స‌రే వారే స్వ‌యంగా పోటీ చేస్తూ దుమ్ములేపుతున్నారు.

మొన్న జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బాగానే స‌త్తా చాటారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పార్టీ ఎఫెక్ట్ బాగా ఉంది.ఆకివీడులో మూడు చోట్ల విజ‌యం సాధించారు.

ఇక్క‌డ వైసీపీని కాద‌ని జ‌న‌సేన గెల‌వ‌డం అంటే మామూలు విష‌యం కాదు.అంటే వైసీపీని కాద‌నుకుంటే టీడీపీకి స‌మానంగా జ‌న‌సేన‌ను ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌నే చెప్పొచ్చు.

నిజానికి టీడీపీ వ‌రుస ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందడం కూడా జ‌న‌సేన‌కు బాగానే క‌లిసి వ‌స్తోంది.కొత్త పార్టీ కాబ‌ట్టి ఒక అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న అటు ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌క్తం అవుతుంది.

కానీ ప‌వ‌న్ మాత్రం ఈ విష‌యంలో ప‌ట్టించుకోవ‌ట్లేదు.

Telugu Ap Potics, Chandra Babu, Janasena, Muncipal, Pawan, Ys Jagan, Ysrcp-Telug

అంత‌కు ముందు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా బాగానే గెలిచుకుంది.జ‌న‌సేన.ప‌వ‌న్ వీరికి ఓటేయాల‌ని పెద్ద‌గా ప్రెస్ మీట్లు, బ‌హిరం స‌భ‌లు పెట్ట‌క‌పోయినా అన్ని గెలుచుకున్నారంటే మామూలు విష‌యం కాదు.

ఒక‌వేళ ప‌వ‌న్ గ‌న‌క ఈ వ‌రుస ఎన్నిక్ల‌లో తీవ్రంగా ప్ర‌చారం చేసి ఉంటే మాత్రం మ‌రిన్ని సీట్లు ద‌క్కుతాయని నిపుణులు చెబుతున్నారు.టీడీపీ కంటే కూడా జ‌న‌సేన‌కు నిఖ‌ర్సైన కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

వారంతా క‌మిట్ మెంట్ తోనే ప‌నిచేస్తున్నారు.అది ప‌వ‌న్‌కు బాగా క‌లిసి వ‌చ్చే అంశం.

ఇప్ప‌టికైనా ప‌వ‌న్ గ్రౌండ్ లెవ‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని కోరుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube