'రాజకీయ చిలక' పలుకులు : జనసేన గెలిచే సీట్లు ఇవేనట !

రాజకీయ జోస్యం చెప్పడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్ర ఆక్టోఫస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల్లో కూడా తన సర్వే ఫలితాలను కొద్ది కొద్దిగా లీకులు ఇస్తున్నాడు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో లగడపాటి జోస్యం ఫలించకపోగా ఆయన బెట్టింగ్ రాయుళ్ల కోసమే తప్పుడు సర్వే ఫలితాలను వెల్లడించాడనే అపవాదు మూటగట్టుకున్నాడు.

 Janasena-TeluguStop.com

అయితేనేమి లగడపాటి రాజగోపాల్ చిలక జోస్యానికి ఎక్కడా డిమాండ్ తగ్గలేదు.మే 19వ తేదీ వరకు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు వీలులేకపోవడంతో రాజగోపాల్ తనకు అత్యంత సన్నిహితులైన కీలక నేతలతో ఈ సర్వేల సమాచారాన్ని లీక్ చేస్తున్నాడు.

ఇప్పటికే సోషల్ మీడియాలో లగడపాటి సర్వే ఫలితాలు ఇవే అంటూ ఎవరికి వారు సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నారు.ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు, గెలిచేది టిడిపినా లేక వైసీపీనా అన్న విషయాన్ని పక్కనపెడితే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఏపీలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నది తెలిసిందే.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాపుల ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఈ సామాజిక వర్గం వారంతా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎం అవ్వాలని కలలు కన్నారు.

కాపు ఉద్యమం తర్వాత ముద్రగడ పద్మనాభంకు ఆ ఛాన్స్ వస్తుందని అనుకున్నా ఆయన దానిని ఉపయోగించుకోలేకపోయారు.ఇదంతా పవన్ కి బాగా కసివస్తుందనే అంతా భావించారు.

జనసేన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాటు గోదావరి జిల్లాల్లో టీడీపీ వైసీపీ అభ్యర్థుల జాతకాలు మారిపోతున్నాయని , ఆ పార్టీ ప్రభావం 30 – 40 సీట్లలో స్పష్టంగా కనిపిస్తుందని లగడపాటి చెప్పుకొస్తున్నారు.ఇక జనసేన అయితే తాము 15 నుంచి 20 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంగా ఉన్నాయి.

ఇక ఎంపీ సీట్ల విషయానికొస్తే వైజాగ్, నరసాపురం, అమలాపురం లాంటి సీట్లు తమ ఖాతాలో పడతాయి అన్న అంచనాలో ఉంది.ఎవరి అంచనాలు ఎలా ఉన్నా లగడపాటి సర్వేలో మాత్రం జనసేన అంచనాలకు మించి డబల్ డిజిట్‌ ఫిగర్‌ సీట్లు సాధిస్తుందని తేలినట్టు ప్రచారం సాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube