ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? స్పందించు సేనాని ?

ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ? దానిని ఉపయోగించుకుని రాజకీయంగా బలం పెంచుకుందామనే ఆలోచనతో రాజకీయ పార్టీలు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటాయి.ఏదో ఒక రకంగా అన్ని పార్టీల కంటే తమ పార్టీ గొప్పదని , ప్రజలకు మంచి పరిపాలనను అందించగలదని ఇలా ఎన్నో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళతాయి.

 Pawan Kalyan, Janasena Party, Part Time Politics, Tdp, Ap Politics, Movie Shooti-TeluguStop.com

రాజకీయంగా ఏ చిన్న అవకాశం దొరికినా, దానిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి.కానీ ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి చూస్తే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపించడం లేదు.

ప్రస్తుతం టీడీపీ వైసీపీ మధ్య వార్ తీవ్ర స్థాయిలు నెలకొంది.టీడీపీని భూస్థాపితం చేసే విధంగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆ పార్టీలో కీలక నాయకులు అందరినీ హడలెత్తించి టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలనే ప్రధాన ఉద్దేశంగా జగన్ అడుగులు వేస్తున్నారు.

అదే సమయంలో ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించి క్రమక్రమంగా టిడిపిని బలహీనం చేయాలని చూస్తున్నారు.

దీనిలో భాగంగానే గత టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారాలు జగన్ తవ్వి తీస్తున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బలహీనం అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఈ పరిణామాలను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయంగా పై మెట్టు ఎక్కే అవకాశం ఉన్నా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపించలేనట్టుగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం పవన్ హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు.

సినిమా షూటింగ్ లు ప్రారంభం కావడంతో ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆఖరికి ఏపీ బీజేపీ కూడా వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది.

బీజేపీతో పవన్ కు పొత్తు ఉన్నా సరే, సొంతంగా పార్టీని బలోపేతం చేసే అవకాశం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి అవసరం.పవన్ మాత్రం ఆ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేనట్టుగా ఉన్నా, గత ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి చెందగా కేవలం ఒకే ఒక్క సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఓటమి భారం నుంచి త్వరగానే కోలుకున్నా, పవన్ కొంతకాలం యాక్టివ్ గా ప్రజా సమస్యలపై పోరాడుతూ కనిపించారు.కానీ మళ్లీ సైలెంట్ అయిపోవడం జనసేన పార్టీ రాజకీయాలు సీరియస్ గా ఉండవనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి.

పార్టీ అధికారం దక్కించుకోవాలంటే సీరియస్ గా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది.కేవలం పార్ట్ టైం పాలిటిక్స్ తో ముందుకు నడుపుదాం అంటే అది జరగని పని.నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, బలం పెంచుకుని బలమైన రాజకీయ పార్టీగా తయారు చేయగలిగితే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.పవన్ కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.

వారందరినీ సరైన ఆయుధాలుగా మార్చుకుని, తన రాజకీయ ప్రత్యర్థులపై గురిపెట్టే అవకాశం ఉన్నా, ఆ విధంగా పవన్ వ్యవహరించలేకపోవడం జనసేన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నర్ధకంగా మార్చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube