నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై వైరల్ కామెంట్లు చేసిన జానారెడ్డి ..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.గతంలో జరిగిన దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 Janareddy Makes Viral Comments On Nagarjunasagar By Election-TeluguStop.com

ముఖ్యంగా జరిగిన గత ఎన్నికలలో బిజెపి పార్టీ ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో అధికార పార్టీ టిఆర్ఎస్ పై ఉన్న కొద్దీ ప్రస్తుతం ఒత్తిడి పెరుగుతుంది.ఇలాంటి తరుణంలో నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు షురూ అయ్యాయి.

పరిస్థితి ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డి కోసం త్యాగం చేయడానికి రెడీ అవుతున్నట్లు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి.పూర్తి విషయంలోకి వెళితే జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి బిజెపి పార్టీ నుండి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగాలని వ్యూహాలు వేస్తున్నట్లు, ఇదే తరుణంలో అనుచరులు కొడుకు కి సపోర్ట్ చేయాలని అంటున్నట్లు, దీంతో .తన కొడుక్కి టికెట్ కన్ఫర్మ్ అయితే తాను పక్కకు తప్పుకునే అవకాశం ఉంది అన్న రీతిలో జానారెడ్డి కామెంట్లు చేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.ఇదే జరిగితే గనుక కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 Janareddy Makes Viral Comments On Nagarjunasagar By Election-నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై వైరల్ కామెంట్లు చేసిన జానారెడ్డి ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Nagarjuna Sagar #Jana Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు