జానకి కలగనలేదు సీరియల్ నటుడు సీక్రెట్ లవ్.. ఆ నటితో ఎంగేజ్మెంట్!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా పెళ్లి జీవితంలో అడుగు పెట్టాలి అని అనుకుంటారు.ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటారు.

 Janaki Kalaganalu Serial Actor Secret Love Engagement With That Actress Janaki K-TeluguStop.com

కొందరు పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు.మరికొందరు జీవితంలో పెళ్లి కూడా ఒక ముఖ్య భాగము అని పెళ్లి వైపు అడుగులు వేస్తుంటారు.

అలా ఇప్పటికి చాలామంది వెండితెర, బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని పెళ్లి జీవితంలో బాగా సెటిల్ అయ్యారు.ఇక బుల్లితెర నటీనటులు కూడా ఇప్పటి వరకు చాలామంది పెళ్లిలు చేసుకోగా ఇటీవలే దేవత సీరియల్ నటి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో బుల్లితెర నటుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకు ఆ నటుడు ఎవరో కాదు.జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి.

ఇక జానకి కలగనలేదు రామచంద్ర పాత్రలో నటించి మంచి అభిమానం సంపాదించుకున్నాడు.ఈయన ఈ సీరియల్ కంటే ముందు ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు.

అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.అలా తెలుగు ప్రేక్షకులలో మంచి అభిమానం సంపాదించుకున్నాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే ఈయన తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.

Telugu Sirisirimuvvalu, Tejashwini, Tollywood, Uyyala Jampala-Movie

ఇక ఈయన చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఆమె కూడా బుల్లితెర నటి.కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్లో నటించిన తేజస్విని గౌడతో ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.తేజస్వినికి కూడా బుల్లితెరపై మంచి పేరు ఉంది.

వీరిద్దరు గత కొంతకాలం నుండి లవ్ చేసుకుంటున్నట్లు తెలిసింది.దీంతో ఈ జంట ఈరోజు తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

మొత్తానికి ఇంతకాలం సీక్రెట్ లవ్ నడిపి ఈరోజుతో తమ ప్రేమకు ముగింపు పలికి పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఇక ఈ జంట ఎంగేజ్మెంట్ కు పలువురు బుల్లితెర సెలెబ్రెటీలు కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాకుండా కొత్త జంటతో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, వారి అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంతకాలం సీక్రెట్ గా లవ్ చేసిఎవరికి బయట పెట్టకుండా బాగానే దాచారు కదా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు.

ఇక పెళ్లి తర్వాత తేజస్విని సీరియల్స్ లో నటిస్తుందా లేదా అని తన అభిమానులు తెగ ప్రశ్నలు వేస్తున్నారు.మొత్తానికి ఈ ఇద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube