జానా విజయం ఫుల్ ధీమాగా కాంగ్రెస్.. మరి ప్రచారం చేయరా?

తెలంగాణలో త్వరలో జరగనున్న రాజకీయ సమరం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.వరుస ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఈ స్థానం ఖాళీ అయింది.

 Jana Victory Full Slow Congress Will Campaign Again, Congress Party, Jana Reddy-TeluguStop.com

దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.

అయితే మిగతా ఎన్నికల్లో ఒడినప్పటికీ ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం పట్ల కాంగ్రెస్ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు కంచుకోట.

మాజీ మంత్రి జానారెడ్డి ఏడు సార్లు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.గత ఎన్నికల్లో కేసీఆర్ హవాలో 7 వేల ఓట్ల మెజారిటీతో నోముల నరసింహయ్య చేతిలో ఓడిపోయాడు.

అయితే ఇప్పుడు మరల జానాకు అవకాశం వచ్చింది.అయితే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పెద్దగా నియోజకవర్గం ప్రజలకు పరిచయం లేని వ్యక్తి కావడంతో జానాకు పూర్తిగా నియోజకవర్గంపై పట్టు ఉండటంతో కాంగ్రెస్ నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేనట్టు తెలుస్తోంది.

జానాకు ఇటీవల జ్వరంతో బాధపడుతున్న పరిస్థితులలో కాంగ్రెస్ నేతలెవరూ అంతగా ప్రచారం చేయలేదనే వార్తలు వినబడుతోంది.మరీ ఇంత నమ్మకం ఉంటే కష్టమంటూ కాంగ్రెస్ నాయకులకు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరి కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో నెగ్గుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube