తెలంగాణపై పవన్ షాకింగ్ డెసిషన్..పొత్తు  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో చక్రం తిప్పనున్నారా..? తెలంగాణా రాజకీయాల్లో కూడా పవన్ కింగ్ మేకర్ కాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నాయకులు… ఇప్పటికే ఏపీలో దూకుడుగా ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఇదే తరహాలో స్పీడుని పెంచడానికి ఏ మాత్రం ఆలోచన చేయడంలేదు. తెలంగాణలో కూడా జనసేన అన్ని విధాలుగా కింగ్ మేకర్ అవ్వడమే ఇప్పుడు ఉన్న మరొక కర్తవ్యం అంటున్నారు అయితే తెలంగాణలో పాగా వేయడానికి పవన్ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి..? ఏ విధంగా ముందుకు వెళ్లనున్నాడు అనే వివరాలలోకి వెళ్తే..

తెలంగాణలో ఏ నిమిషంలో ఎన్నికలు జరిగినా సరే పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలి తెలంగాణా పార్టీ శ్రేణులకి పవన్ పిలుపు ఇచ్చారు.. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అన్ని చర్యలను చేపదుతున్నామని తెలిపారు పవన్..జిల్లా, గ్రామ, మండల, రాష్ట్ర సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోందని ప్రతీ కార్యకర్త ఎంతో సమన్వయంగా పని చేయాలని పవన్ కమిటీలో తెలిపారు..అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయననున్నట్టు ఆయన ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే..

Jana Sena Alliance With Kodandaram Party In Telangana-

Jana Sena Alliance With Kodandaram Party In Telangana

అయితే ఈ క్రమంలోనే పవన్ పార్టీ ముఖ్య నేతలతో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో చర్చలు జరిపారు…తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను రెండు, మూడు వారాల్లో ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకొన్నారు.తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చే పార్టీలతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కీలక నేతలతో ముందుగానే సమీక్షించారని తెలుస్తోంది..అయితే పవన్ గతంలో టీఆర్ఎస్ కి మద్దతుగా నిలిచిన విషయం విదితమే ఈ క్రమంలో

పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో జతకడుతాడో అంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి..టీఆర్ఎస్ పార్టీతో కలిసి అడుగులు వేస్తాడా లేక కేసీఆర్ కి వ్యతిరేకంగా కోదండరాం పార్టీతో జత కడుతాడా అనే విషయం కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది..అయితే కాంగ్రెస్ తో జత కలిసే అవకాశం లేదని..ఉద్యమాల నుంచీ పుట్టుకొచ్చిన కోదండరాం పార్టీతోనే జతకట్టే అవకాశం ఉందని.. అంటున్నారు విశ్లేషకులు..మరి పవన్ పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..