జానా రెడ్డికి జూనియ‌ర్ యాద‌వ్ బెంగ‌.. సాగ‌ర్ పాలిటిక్స్ హీట్‌!

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం కానుంది.ఇప్ప‌టికే కొన్నాళ్ల కింద‌ట దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జ‌రిగింది.

 Jana Reddy Worry About Yadav..sagar Politics Heat, Jana Reddy, Sagar Politics, C-TeluguStop.com

ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన టీఆర్ ఎస్ నేత రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో ఉప ఎన్నిక‌జ‌రిగింది.అయితే.

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న టీఆర్ ఎస్ ఇక్క‌డ తీవ్ర ఉత్కంఠ భ‌రితంగా ప‌రాజ ‌యం పాలైంది.త‌ర్వాత గ్రేట‌ర్‌లోనూ టీఆర్ ఎస్ ముక్కీ మూలిగీ.

గెలుపు ప‌ట్టాలెక్కింది.అయితే.

ఇప్పు డు మ‌రో ఉప ఎన్నిక రానుంది.నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం సాధించిన మాజీ క‌మ్యూ నిస్టు.

నోముల న‌ర‌సింహ‌య్య‌.ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందారు.

దీంతో ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.అయితే.ఇప్పుడు ఇక్క‌డ గెలిచి న తీరాల్సిన ప్ర‌తిష్టాత్మ‌క ప‌రిస్థితి అధికార పార్టీకి ఎదురైంది.ఎందుకంటే.

దుబ్బాక‌లో ఓట‌మి పార్టీపై ప్ర తికూల ప్ర‌భావాన్ని ప‌డేసింది.ఇక‌, గ్రేట‌ర్‌లో మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నా.

కేసీఆర్ బృందానికి, ప్ర భుత్వానికి, పార్టీకి కూడా సంతృప్తి క‌లిగించ‌లేదు.దీంతో ఇప్పుడు సాగ‌ర్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కేసీ ఆర్ భావిస్తున్నారు.

అయితే.ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడు, మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జానా రెడ్డి పోటీకి దిగుతున్నార‌ని స‌మాచారం.

దీంతో జానాకు చెక్ పెట్టేందుకు.కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu Telangana, Congress, Dubbakilo Otami, Jana Reddy, Jana, Kc, Manam Ranjit,

ప్ర‌స్తుతం జానాపై నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎత్తున సింప‌తీ ఉంది.ఓడిపోయిన త‌ర్వాత కూడా నియోజ‌క‌వ ర్గంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు.దీంతో ఈ సింప‌తీకి అంతే సింప‌తీ ఉన్న నాయ‌కుడిని రంగంలోకి దింపాల‌ని కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్‌ఎస్‌ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌ను రంగంలోకి దింపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈయ‌న యువ నాయ‌కుడు, టీఆర్ ఎస్‌లో దూకుడుగా ఉన్న నేత‌.నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇ‍ప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.దీంతో జానారెడ్డిపై రంజిత్ యాద‌వ్ ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు సాగ‌ర్ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది.

మ‌రి ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube