పాకిస్తానీ నోట..జనగణమన పాట..సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో..మీరూ చూడండి.     2018-09-22   13:53:21  IST  Rajakumari K

ఏషియన్ కప్‌లో భాగంగా రెండు రోజుల కిందట పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ పై 162 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసేందే ..అయితే మ్యాచ్‌ను ప్రారంభించే ముందు రెండు జట్ల సభ్యులు మైదానంలోకి వెళ్లిన తర్వాత రెండు దేశాల జనం తమ తమ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు..ఆ రోజు ఆలపించారు..ఇక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది..ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

భారత్ జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా,కొందరు పాకిస్తానీయులు సైతం గొంతు కలిపారు..జనగణమన పాడేప్పుడు మనం లేచినిలబడతాం అది మనం జాతీయగీతానికి ఇచ్చే గౌరవం..కేవలం భారతీయులు మాత్రమే కాదు..పాకిస్తానీయులు కూడా గౌరవంగా లేచి నిలబడి జనగణమన ఆలపించారు.

కొన్నిచోట్ల సరిగ్గా పలకకపోయినా భారత జాతీయ గీతాన్ని గొప్పగా గౌరవించారు. దీంతో వారు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ పాకిస్తాన్ జాతీయగీతం ఏంటో తెలుసా..‘క్వామీ తరానా(పవిత్ర భూమి) …