నిర్మాతలను డబ్బు అడగకుండా ​నష్టపోయిన నటి...

తెలుగులో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి మాతృభాష తెలుగు కాకపోయినా జమున తెలుగు నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు.హంపీలో పుట్టిన జమున పాఠశాలలో చదువుకునే సమయంలో నాటకాల వైపు ఆకర్షితులయ్యారు.

 Jamuna Lost Lakhs Of Rupees Because Of Movie Producers-TeluguStop.com

నాటకాల్లో అద్భుతంగా నటించడంతో ఈ నటికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.సత్యభామ పాత్రలో ఎక్కువగా నటించి ఆ పాత్రకు తనను మించి ఎవరూ న్యాయం చేయలేరనే పేరును సంపాదించుకున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా జమున నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.బాల్యంలోనే జమున సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు.ఆమె నటనకు ఎన్నో అవార్డులు సైతం లభించాయి.జమున ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు.అయితే నిర్మాతలను డబ్బులు అడగకుండా ఈ నటి ఎక్కువ మొత్తంలో నష్టపోయారు.

 Jamuna Lost Lakhs Of Rupees Because Of Movie Producers-నిర్మాతలను డబ్బు అడగకుండా ​నష్టపోయిన నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యునరేషన్లు కోట్ల రూపాయలు కాగా కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ల పారితోషికాలు వేలల్లో ఉండేవి.

స్టార్ హీరో కృష్ణ కూడా నిర్మాతలు తక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చినా ఇబ్బంది పెట్టేవారు కాదు.ఆరోజుల్లో కృష్ణగారు, తాను ఎక్కువ మొత్తం డబ్బును పోగొట్టుకున్నామని నిర్మాతలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే వదిలేసే వాళ్లమని జమున అన్నారు.

సినిమా పూర్తైన తరువాత డబ్బులు అడిగేవాళ్లమని జమున చెప్పుకొచ్చారు.కొంతమంది హీరోయిన్లు రెమ్యునరేషన్ ఇవ్వకపోతే షూటింగ్ ఎగ్గొట్టే వాళ్లు అని అయితే తాను అలా చేయలేదని జమున చెప్పుకొచ్చారు.సినిమాకు నష్టం వస్తే మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయని జమున వెల్లడించారు.జమున మంచి మనస్సు వల్ల నిర్మాతలు కూడా ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి ఉన్నారు.

ఈతరం నటీమణుల్లో జమున స్థాయిలో మంచి మనస్సు ఉన్న నటీమణులు లేరనే చెప్పాలి.

#Actress Jamuna #Jamuna #Krishna #Jamuna #ActressJamuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు