జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు  

Governor Malik Unbelievable Message To Kashmir People-

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.జమ్మూకాశ్మీర్ లో తరచూ పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన ఒక కార్యక్రమం లో మాట్లాడుతూ నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణ గా నిలిచే పోలీసులను చంపడం కంటే,అవినీతి చేసే రాజకీయ నేతలని చంపాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Governor Malik Unbelievable Message To Kashmir People- Telugu Viral News Governor Malik Unbelievable Message To Kashmir People--Governor Malik Unbelievable Message To Kashmir People-

ఒకరకంగా ఉగ్రవాదులకు పోలీసులను కాదు రాజకీయ నేతల్ని టార్గెట్ చేసి చంపాలి అని సూచించినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.దీనితో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అక్కడ పెద్ద దుమారమే రేగింది.

ఒక రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సత్యపాల్ ఈ విధంగా ఉగ్రవాదులకు సూచించడం సరికాదు అంటూ పలువురు ప్రాముఖ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు.

Governor Malik Unbelievable Message To Kashmir People- Telugu Viral News Governor Malik Unbelievable Message To Kashmir People--Governor Malik Unbelievable Message To Kashmir People-

ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు.

భద్రతా బలగాలను చంపుతున్నారు.ఎస్‌పీఓలను చంపుతున్నారు.

ఇలాంటి వారిని చంపడం కంటే ప్రజల ఆస్తుల్ని దోచుకునే రాజకీయ నేతల్ని, అవినీతికి పాల్పడే అధికారులపై తమ ప్రతాపాన్ని చూపాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.కొంపతీసి గవర్నర్ గారి సూచనలను ఉగ్రవాదులు పాటిస్తారేమో చూడాలి.