జమ్మూ కశ్మీర్‌లో దారుణం.. పిల్లల ప్రాణం తీసిన జలుబు.. !

ప్రకృతిలో ఏర్పడే మార్పులను తట్టుకుని జీవించడం మానవుడు అలవాటు చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఒక్కోసారి ప్రకృతిలో ఏర్పడే ఊహించని మార్పులు ప్రాణాలు కూడా తీస్తాయి.

 Jammu Kashmir, Two Nomad Children, Die, Severe Cold-TeluguStop.com

ఇలా అనుకోకుండా జరిగే వాతావరణ మార్పుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడి ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యంగా వర్ష కాలం, చలికాలం అయితే వాతావరణంలో చాలా మార్పులు ఏర్పడతాయని తెలిసిందే.

జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి పరిస్దితే ఇద్దరి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది.ఆ వివరాలు చూస్తే.

ఓ సంచార జాతి కుటుంబం దక్షిణ కశ్మీర్‌లోని దేవ్సార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారట.వారికి సొంత ఇల్లు అంటూ లేదు.

అందువల్ల ఓ టార్పాలిన్ టెంట్‌లో ఉంటున్నారు.కాగా ప్రస్తుతం శీతకాలం కావడంతో ఇక్కడి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు కురుస్తుంది.

ఈ పరిస్దితుల్లో ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులకు జలుబు చేసింది.అది కాస్తా తీవ్రంగా మారి విపరీతంగా జ్వరం వచ్చి ఆ చిన్నారులు ఇద్దరు మరణించారట.

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్దానికులు వారికి తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారట.అదీగాక పిల్లలు మరణించారనే వార్త తెలిసిన తర్వాత అధికారులు వచ్చి బ్లాంకెట్స్‌ ఇచ్చి వెళ్లారట.

ఈ పనేదే ముందుగా చేసి ఉంటే ఆ పిల్లలు బ్రతికే వారుగా అని అనుకుంటున్నారట కొందరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube