ఏకంగా ప్రధానికే ఫిర్యాదు చేసిన ఆరేళ్ల బాలిక.. అసలు దేనిగురించి అంటే..?!

కరోనా కారణంగా గతేడాది నుండి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే.వర్క్ ఫ్రం హోమ్ వలన ఉద్యోగులు, ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

 Jammu Kashmir 6 Years School Girl Complaints To Pm Modi On Online Classes , 6 Ye-TeluguStop.com

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.రోజుల తరబడి ఇంటికే పరిమితం కావడంతో ప్రజల లైఫ్ స్టైల్ లో మార్పులు వచ్చాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి.స్కూళ్లు కూడా మూసివేశారు.

పరీక్షలు రద్దు చేశారు.పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు మళ్లీ ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్ తరగతుల పట్ల విద్యార్థులు విసిగిపోతున్నారు.తాజాగా జమ్మూ కశ్మీర్‌ కు చెందిన ఓ బాలిక ఆన్‌ లైన్ తరగతుల పట్ల విసిగెత్తిపోయి.

ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది.

45 సెకన్ల పాటు తీసిన వీడియోలో ఆన్‌లైన్ క్లాస్‌ వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆ బాలిక చెప్పుకొచ్చింది.

ఈ ఆరేళ్ల బాలిక తన ఇబ్బందులను ప్రధానికి చెబుతున్న వీడియోను ఔరంగజేబు నక్ష్‌బండి అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ బాలిక ఇలా ఆన్ లైన్ క్లాసులతో తాను పడుతున్న బాధలను వివరించింది.ఆన్‌ లైన్ తరగతులు ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతున్నాయని.ఇంతే కాకుండా ఇంగ్లీష్, గణితం, ఉర్దూ, ఈవిఎస్, కంప్యూటర్ క్లాస్ కు కూడా జరుగుతున్నాయని.

ఇవన్నీ ఉండటంతో తమకు పనిభారం పెరుగుతోందని ఆ చిన్నారి చెప్పింది.

మోదీ సార్. మేమెందుకు ఎక్కువ పని భారాన్ని ఎదుర్కోవాలి? పని భారం తగ్గాలంటే పిల్లలమైన మేం ఏం చేయాలి? నమస్కారం మోదీ సార్.బై.’ అంటూ ఆమె తన వీడియోను ముగించేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.ఆన్‌లైన్ క్లాసుల బాధ నుంచి స్కూల్ పిల్లలను రక్షించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube