మూడు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయంటున్న చంద్రబాబు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది.కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే.

 Jamili Elections Will Be Soon Says Chandrababu Naidu-TeluguStop.com

అయితే ఈ ప్రభుత్వాలు పూర్తిగా అయిదు సంవత్సరాలు అధికారంలో ఉండక పోవచ్చు అని, తమ అదృష్టం బాగుంటే మూడు సంవత్సరాల్లోనే అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు రావచ్చు, కేంద్రంలో కూడా ఎన్నికల నగారా మోగవచ్చు అంటూ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు నూరి పోస్తున్నాడు.ఈ మూడు సంవత్సరాలు కష్టపడండి ఆ తర్వాత అంతా మళ్లీ మనదే అంటూ బాబు తన కార్యకర్తలకు చెబుతున్నాడు.

బాగు ఎందుకు మూడు సంవత్సరాల్లో ఎన్నికలు అంటున్నాడో కొందరికి అర్థం కావడం లేదు.అసలు విషయం ఏంటీ అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలీ ఎన్నికలకు సిద్దం అంటోంది.

నరేంద్ర మోడీ కల అది.ప్రస్తుతం తాను ఏది అనుకుంటే అదే చేయగల సత్తా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.అందుకే ఆయన తలుచుకుంటే దేశంలో జమిలీ ఎన్నికలు పెద్ద కష్టం కాదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.అందుకే ముడు లేదా మూడుననర ఏళ్లలో జమిలీ ఎన్నికల ద్వారా దేశ వ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకు మరియు పార్లమెంటుకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు ఆశ పడుతున్నాడు.

మరి బాబు కోరుకున్నది జరిగేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube