పుష్కరకాలం పూర్తి చేసుకున్న జల్సా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న పవన్‌కు పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన చిత్రంగా జల్సా నిలిచింది.

 Jalsa Movie Completed 12 Years, Pawan Kalyan, Jalsa, Trivikram, Ileana-TeluguStop.com

ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు ఫుల్ ఫాంలో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, ఇప్పటికీ శ్రోతలను అలరిస్తుంది.

అదిరిపోయే పాటలకు ఆలోచింపజేసి ఆకట్టుకునే మాటలు తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.త్రివిక్రమ్ డైలాగులను పవన్ నోటి వెంట వింటూ ప్రేక్షకులు సినిమాలో లీనమై పోయారు.

ఇక పవన్ బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీకి థియేటర్లలో నవ్వులే నవ్వులు.కథా పరంగా ఎక్కడా బోరింగ్ సీన్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారు.

2008, ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్‌ను అందుకోవడమే కాకుండా ఏకంగా 100 రోజులు కూడా పూర్తి చేసుకుని పవన్ కెరీర్‌లో అదిరిపోయే చిత్రంగా నిలిచింది.త్రివిక్రమ్-పవన్ కాంబోకు శ్రీకారం చుట్టింది ఈ జల్సా సినిమానే.

ఇక ఆ తరువాత పవన్ వరుసగా సక్సెస్‌ చిత్రాలతో దూసుకుపోతూ ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube