ఆస్కార్ కి నామినేట్ అయిన జల్లికట్టు మూవీ  

సౌత్ ఇండియాలో బాగా ప్రాముఖ్యం ఉన్న సంప్రదాయ క్రీడా జల్లికట్టు.ఈ క్రీడా తమిళ్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందిగా చూస్తారు.

TeluguStop.com - Jallikattu Movie Nominated Oscars

జల్లికట్టు క్రీడని కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తే తిరిగి వెనక్కి తగ్గేంత వరకు పెద్ద పోరాటమే చేశారు.ప్రాణాలకే ప్రమాదం అయిన ఈ ఆట కోసం తమిళనాడు ప్రజలు ప్రాణం పెడతారు.

ప్రస్తుతం జల్లికట్టు క్రీడ నేపధ్యంలో స్టార్ హీరో సూర్య కూడా ఒక సినిమా చేస్తున్నాడు.వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

TeluguStop.com - ఆస్కార్ కి నామినేట్ అయిన జల్లికట్టు మూవీ-General-Telugu-Telugu Tollywood Photo Image

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే దీనికంటే ముందుగానే జల్లికట్టు క్రీడ నేపధ్యంలో మలయాళంలో ఓ చిన్న సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా రిలీజ్ తర్వాత విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని సూపర్ సక్సెస్ సాధించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి అరుదైన గౌరవం లభించింది.

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి జల్లికట్టు చిత్రాన్ని నామినేట్ చేశారు.దీనిపై ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రావైల్ మాట్లాడుతూ ఈసారి భారత్ నుంచి ఆస్కార్ నామినేషన్ కోసం మొత్తం 27 సినిమాలు వచ్చాయని వాటిలో మనుషులు, జంతువుల మధ్య భావోద్వేగాలను అత్యద్భుతంగా చూపిన జల్లికట్టు చిత్రాన్ని నామినేట్ చేశామని వెల్లడించారు.

తమిళనాడు క్రీడ అయిన ఈ ఎలిమెంట్ ని ముందుగా మలయాళీ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితోనే వెట్రిమారన్ సూర్యతో జల్లికట్టు నేపధ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

సౌత్ ఇండియా నుంచి ఈ మధ్యకాలంలో ఆస్కార్ కి నామినేట్ అవుతున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగాయి.ఎక్కువగా మలయాళీ సినిమాలు ఆస్కార్ బరిలోకి వెళ్తుండటం గమనార్హం.

#Jallikattu #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు