బీకామ్ లో ఫిజిక్స్ : జలీల్ ఖాన్ ఈ కొత్త ఎత్తు వర్కవుట్ అవుతుందా ..?

వైసీపీలో గెలిచి… టీడీపీలోకి జుంపింగ్ చేసి… మంత్రి అవ్వాల్సిన విజయవాడ పశ్చిమ ఎమ్యెల్యే జలీల్ ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో బీకామ్ లో ఫిజిక్స్ చదివాను అంటూ చెప్పి … నవ్వులపల్లయ్యాడు.అంతే కాదు… ఆ ఎఫెక్ట్ తో మంత్రి పదవి అవకాశం కూడా కోల్పోయి… కామెడీ ఎమ్యెల్యేగా మిగిలిపోయారు.

 Jaleal Kahan New Subject Is Phisics In B Com-TeluguStop.com

ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవి సంగతి అలా ఉంచితే….అసలు ఇప్పుడు ఆయనకు ఎమ్యెల్యే టికెట్ కూడా దొరికే పరిస్థితి లేదు.

దీంతో అన్నిరకాలుగా వెంకపడిపోయాను అనే భావనలో జలీల్ ఖాన్ ఉండిపోయాడు.అందుకే ఇప్పుడు తన బలం ఏంటో బలగం ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఎలాగూ… రాబోయే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం అనుమానంగా కనిపిస్తుండడంతో పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కొత్త ప్లాన్ వేసాడు.తనకు కాకపోయినా తన కుమార్తెకైనా టికెట్‌ ఇవ్వాల్సిందే అంటూ… జలీల్ ఖాన్ కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు.కానీ బాబు మాత్రం టికెట్‌ రాకపోవచ్చు అన్న విషయాన్ని నేరుగా చంద్రబాబు చెప్పకుండానే అనేక సర్వేల్లో తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఆయనకు అర్ధం అయ్యేలా చెప్పేస్తున్నాడు.
ఈ విషయంపై ఒక అవగాహన కు వచ్చిన జలీల్ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ ఇవ్వాలని, అలా కానీ పక్షంలో తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని జలీల్ ఖాన్‌ కోరినా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు.అందుకే తన బలం నిరూపించుకుని తన కుటుబంలో ఒకరికి టికెట్ వచ్చేలా జలీల్ ప్రయత్నిస్తున్నాడు.

దీనిలో భాగంగానే … తన పుట్టిన రోజును జక్కంపూడిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పార్టీ పెద్దలతో పాటు మతపెద్దలను, కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరి సమక్షంలో తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా పరిచయం చేయాలని జలీల్‌ ఖాన్ తహతహలాడుతున్నాడు.

అయితే ఇప్పటికే విజయవాడ పశ్చిమ టికెట్ కోసం కొరపాటి జగన్‌ అనే నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తుండడం జలీల్ ఖాన్‌కు మింగుడుపడడంలేదు.ఒక వేళ టీడీపీలో టికెట్ హామీ పార్టీ నుంచి రాకపోతే వేరే ఏదైనా పార్టీలోకి జంప్ చేద్దామా అంటే ఇప్పటికే జనసేన మినహా అన్ని పార్టీలోనూ ఆయన కాలుపెట్టి వచ్చాడు.

అయినా బీకామ్ ఫిజిక్స్ ఎఫెక్ట్ తో ఆయన్ను ఏ పార్టీ కూడా తీసుకునేందుకు సిద్ధంగా లేదు … ఒకవేళ తీసుకున్నా.టికెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కే అవకాశం అయితే కనిపించడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube