ఆ హీరో సినిమాకు క్లాప్ కొట్టి నెటిజన్ల ట్రోలింగ్ గురైన జక్కన్న... కారణం అదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆదరణ ఉంది.

 Jakkanna Was Trolled By Netizens After Clapping For That Hero Movie Do You Know-TeluguStop.com

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న రాజమౌళిని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

అసలు నెటిజన్లు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సినిమాకు క్లాప్ కొట్టారు.

ఇలా క్లాప్ కొట్టడమే రాజమౌళి చేసిన తప్పు అంటూ నెటిజన్లు అతనిని ట్రోలింగ్ చేస్తున్నారు.

Telugu Janiliya, Kireeti, Rajamouli, Sreelela, Tollywood-Movie

గాలి జనార్దన్ రెడ్డి అంటేనే టక్కున గుర్తొచ్చేది ఓబుళాపురం గనుల్లో అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డారని ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉండటమే కాకుండా ఆయన జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై బయట వచ్చారు.అలాంటి వ్యక్తికి సంబంధించిన ఫంక్షన్ కు రాజమౌళి వెళ్లడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఒకానొక సమయంలో లోక్ సత్తా పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటంతో ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ తరపున ప్రచారం చేసిన రాజమౌళి ఇలా ఒక అవినీతి చేసిన వ్యక్తి ఫంక్షన్ కు వెళ్లి క్లాప్ కొట్టడం పై నెటిజన్లు రాజమౌళిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ విషయంపై రాజమౌళి అభిమానులు స్పందిస్తూ సినిమాని కేవలం సినిమా దృష్టితో మాత్రమే చూడాలని హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube