మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సునీల్ హీరోయిన్... ఈ సారి మరింత గ్లామర్ గా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించిన “జక్కన్న” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “మన్నారా చోప్రా” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే సునీల్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని దర్శించుకున్నప్పటికీ తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Jakkanna Movie Fame Mannara Chopra Weight Loss For Movie Offers, Jakkanna Movie,-TeluguStop.com

ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “సీత” అనే చిత్రంలో సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమైంది.ఈ చిత్రంలో మన్నారా చోప్రా కొంతమేర బోల్డ్ గా కనిపించినప్పటికీ ప్లాప్ అవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

దీనికితోడు మన్నారా చోప్రా కొంతమేర బరువు పెరగడంతో సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి.

దీంతో ఈ మధ్య కాలంలో మన్నారా చోప్రా ప్రత్యేకంగా జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకుని మరీ బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

 అంతేగాక ఆహారపు అలవాట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేస్తోంది. దీంతో ఇటీవలే ఓ ప్రముఖ ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమాల్లో దిగిన లేటెస్ట్ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

 దీంతో మన్నారా చోప్రా మళ్లీ బరువు తగ్గి అందాల ఆరబోతకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.దీంతో ఈ ఏమండీ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్దీ సమయంలో నే యాభై వేల పై చిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.అలాగే ఈ మధ్యకాలంలో మన్నార చోప్రా సినిమా అవకాశాల కోసం సన్నబడిందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాగా మన్నార చోప్రా తెలుగులో ఐదు కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో జక్కన్న, రోగ్ చిత్రాలు తప్ప మిగిలిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్నారా చోప్రా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనంటూ చెప్పుకొచ్చింది.అంతేగాక ఇప్పటి వరకు మన్నారా చోప్రా నటించిన చిత్రాల్లో ఈ అమ్మడు అందాల ఆరబోత పరంగా కూడా బాగానే సినీ విమర్శకులను మెప్పించింది.

కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ అమ్మడికి చెప్పుకోవడానికి సినిమా పరిశ్రమలో సరైన హిట్ లేక పోవడంతో పెద్దగా గుర్తింపు నోచుకోలేక పోయింది.కనీసం ఇప్పటికైనా సినీ దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి సినిమా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube