జక్కన్న బర్త్‌డే : 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్పెషల్‌ ఏమైనా ఉందా మరి?  

Jakannah Birthday Is There Any \'rrr\' Special-bahubali In World Wide Film,birthday Today,jakannah,ntr,rajamouli,ramcharan

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి నేడు బర్త్‌డే జరుపుకుంటున్నాడు.ఆయన పుట్టిన రోజు వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.బాహుబలి చిత్రంతో ఆయనకు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు.ఆయన ఏకంగా హాలీవుడ్‌ స్థాయి డైరెక్టర్స్‌తో కూడా పోటీ పడ్డ సందర్బాలు ఉన్నాయి.

Jakannah Birthday Is There Any \'rrr\' Special-bahubali In World Wide Film,birthday Today,jakannah,ntr,rajamouli,ramcharan-Jakannah Birthday Is There Any 'RRR' Special-Bahubali In World Wide Film Birthday Today Jakannah Ntr Rajamouli Ramcharan

బాహుబలి సినిమాకు ముందు తెలుగు పరిశ్రమ, బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమ అన్నట్లుగా టాలీవుడ్‌ కాలంను విడదీయడంలో రాజమౌళి సక్సెస్‌ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Jakannah Birthday Is There Any \'rrr\' Special-bahubali In World Wide Film,birthday Today,jakannah,ntr,rajamouli,ramcharan-Jakannah Birthday Is There Any 'RRR' Special-Bahubali In World Wide Film Birthday Today Jakannah Ntr Rajamouli Ramcharan

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా రికార్డులను బాలీవుడ్‌ మూవీస్‌తో సహా ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్‌ చేయలేక పోతుంది.అందుకే తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకుంటాడని రాజమౌళి ఫ్యాన్స్‌ ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి వచ్చే ఏడాది జులై నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.ఇక నేడు ఆయన బర్త్‌డే సందర్బంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన ఏదైనా స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదంటే పోస్టర్‌ విడుదల అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటించబోతుంది.బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు ఈ చిత్రంలో నటించబోతున్నారు.స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీం జీవితాలను ఆవిష్కరించబోతున్నట్లుగా దర్శకుడు రాజమౌళి చెప్పాడు.

ఎన్టీఆర్‌ భీం మరియు చరణ్‌ అల్లూరి పాత్ర లుక్స్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి నేడు జక్కన్న బర్త్‌డేకు వారి లుక్స్‌ లేదంటే ప్రీ లుక్స్‌ ఏమైనా విడుదల అయ్యేనో చూడాలి.