చైనాకి గట్టి దెబ్బ తగిలింది! మసూద్ విషయంలో భారత్ పంతం నెగ్గింది

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు.భారత్ లో ఎన్నో ఉగ్ర దాడులకి ప్రణాళిక రచించిన వ్యక్తి.

 Jaish Chief Masood Azhar Declared Global Terrorist-TeluguStop.com

తాజాగా జరిగిన పుల్వామా ఉగ్ర దాడిలో ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్ర వాదిగా ప్రకటించింది.దీంతో ఇన్ని సంవత్సరాలుగా భారత్ చేస్తున్న పోరాటంకి అంతర్జాతీయ సమాజం ముందు ప్రతిఫలం వచ్చినట్లు అయ్యింది.

పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న మసూద్ కి అక్కడి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి.పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆ దాడి చేసింది తామే అని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ కుటిల బుద్ధి చూపించి అతనిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే మరో వైపు చైనా కూడా పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడుతూ మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో అడ్డుపుల్లలు వేస్తుంది.అయితే తాజాగా ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో చైనాగా ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.

ఐక్యరాజ్యసమితి మసూద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అనే విషయాన్ని భారత రాయబారి స్య అక్బరుద్దీన్ ట్విట్టర్ లో ప్రకటించారు.ఈ పోస్ట్ తో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేసాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube