ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌ మనదే... ఇండియాలో ఎక్కడంటే?

అవును, ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌ మన దేశంలోనే కలదు.రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) జైపూర్ నగరానికి జ్యువల్‌గా పిలుచుకునే జైపూర్ మహారాజు పూర్వ నివాసం గురించి మీరు వినే వుంటారు.

 Jaipur Rambagh Palace Is The Best Hotel In The World Details, The Best Hotel, I-TeluguStop.com

ప్రస్తుతం ఆ భవనం ఒక లగ్జరీ హోటల్‌గా మారింది.రాంబాగ్ ప్యాలెస్( Rambagh Palace ) అని పిలిచే ఈ హోటల్ అత్యంత సుందరంగా ఉంటుంది.

అద్భుతమైన గార్డెన్స్, అందమైన ఇండియన్ ఆర్కిటెక్చర్ దీని సొంతం.చూడగానే చూపరులను యిట్టె ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ హోటల్ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.అవును, ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా ఈ రాంబాగ్ ప్యాలెస్ ఎంపికై భారతీయులందరికీ గర్వకారణం అయింది.

Telugu Hotel, India, Jaipur, Jaipurrambagh, Rajasthan, Rambaghpalace, Trip Advis

ఇకపోతే ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్ అయినటువంటి ట్రిప్‌ అడ్వైజర్( Trip Advisor ) ప్రతి సంవత్సరం “ట్రావెలర్స్ ఛాయిస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హోటల్స్” అవార్డులను అందజేస్తుంది.కాగా 2023 టాప్ హోటల్స్ లిస్ట్‌లో ఇండియన్ హోటల్ రాంబాగ్ ప్యాలెస్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి దేశం మీసం తిప్పేలా చేసింది.2022, జనవరి 1 నుంచి 2022, డిసెంబర్ 31 వరకు 15 లక్షలకు పైగా హోటళ్ల నుంచి 12 నెలల ట్రిప్‌ అడ్వైజర్ రివ్యూ డేటా విశ్లేషించడం ద్వారా రాంబాగ్ ప్యాలెస్‌ నంబర్.1 హోటల్‌గా ఎదిగింది.

Telugu Hotel, India, Jaipur, Jaipurrambagh, Rajasthan, Rambaghpalace, Trip Advis

ఈ ప్యాలెస్ అందమైన పరిసరాలు, రుచికరమైన ఆహారం, ఫ్రెండ్లీ స్టఫ్‌కు ఫిదా అయినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.విశ్రాంతి తీసుకోవడానికి, రాయల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది గొప్ప ప్రదేశం అని ఎంతోమంది ఫీల్ అవుతున్నారు.ఇకపోతే జ్యువెల్ ఆఫ్ జైపూర్‌గా పిలిచే మొదటి రాంబాగ్ ప్యాలెస్‌ను 1835లో నిర్మించడం జరిగింది.మొదట్లో ఇది రాణికి ఇష్టమైన పనిమనిషికి నివాసంగా ఉండేది.కానీ తర్వాత రోజుల్లో అది రాయల్ గెస్ట్‌హౌజ్, హంటింగ్ లాడ్జ్‌గా రూపాంతరం చెందింది.కాగా 1925లో జైపూర్ మహారాజు రాంబాగ్ ప్యాలెస్‌ను తన శాశ్వత నివాసంగా చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube