కికి ఛాలెంజ్ లో అతను చనిపోయాడంటూ పోలీసుల ట్వీట్ చూసి షాక్.! అతని ఫోటో పోలీసులకు ఎలా దొరికిందంటే.?  

Jaipur Police\'s Kiki Challenge Post Goes Awry-

ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్’ చాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్‌లు ఉద్యమంగా మారాయి.ప్రజలలో మార్పు కలిగించేందుకు సవాళ్ళు విసురుతున్నారు.తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది.అదేమిటంటే… ప్రముఖ సింగర్ డ్రేక్ పాడిన ‘ ఇన్ మై ఫీలింగ్స్’ పాట విపరీతంగా పాపులర్ అవ్వడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో ఓ ఛాలెంజ్ విసిరాడు.

దీంతో అంతర్జాతీయ స్థాయి నుంచి సినీ నటులు ,యువత ఈ కిక్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.ఈ ఛాలెంజ్ ప్రకారం…‘ కదులుతున్న కారు నుంచి కిందకి దిగి కారు నిదానంగా కదులుతుండగా దానితో పాటు డ్యాన్స్ చేసి మళ్లీ కారులోకి రావడమే’.

Jaipur Police\'s Kiki Challenge Post Goes Awry- Telugu Viral News Jaipur Police\'s Kiki Challenge Post Goes Awry--Jaipur Police's KiKi Challenge Post Goes Awry-

ఈ ఛాలెంజ్‌ని పోలీసులు వ్య‌తిరేకిస్తూ, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్‌’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.ముఖ్యంగా సినీ నటులు , క్రీడాకారులు ఈ ఛాలెంజ్ స్వీకరించి అనురించడంతో అసలు తంటాలు మొదలవుతున్నాయి.

అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్‌ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఇన్‌ లవింగ్‌ మెమోరీ ఆఫ్‌ కేకే.కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్‌ పోలీసులు ట్విటర్‌ ఖాతాలో ఉంచారు.‘ఛాలెంజ్‌ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్‌ సుభాష్‌ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు.అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే.

సోషల్‌ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్‌ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్‌ కాల్స్‌ చేయటం ప్రారంభించారంట.మీడియా ముందుకు వచ్చిన జవహార్‌ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు.

అసలు కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికింది అంటే.? 2008లో జవహార్‌ మోడలింగ్‌ చేసేవాడు.ఆ సమయంలో ఫోటోగ్రాఫర్‌ అయిన జవహార్‌ అంకుల్‌.అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు.ఆ సైట్‌ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్‌ ఇచ్చారన్న మాట.

తాజా వార్తలు

Jaipur Police's KiKi Challenge Post Goes Awry Related....