రేవంత్ వెనుక జైపాల్ హస్తం     2017-10-26   05:54:35  IST  Bhanu C

రేవంత్ రెడ్డి టిటిడిపి ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అంటే అది ఇప్పటికిప్పుడు జరిగిన తంతు కాదు అని వేరే చెప్పక్కలేదు.ఒక్కరోజులోనో..ఒక నెల లోనో తీసుకునే నిర్ణయం మాత్రం కాదు అనేది స్పష్టం..అయితే రేవంత్ ముందు నుంచీ కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడికి దగ్గరగా ఉంటున్నారు అని తెలిసినా రేవంత్ మీద ఉన్న నమ్మకంతో పెద్దగా ఆ విషయం పట్టించుకోలేదు.కాంగ్రెస్ గూటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఇప్పటివరకు రేవంత్ విషయంలో అవేవి బయటకు రాలేదు.

ఎంత పెద్ద నాయకుడు అయినా సరే కాంగ్రెస్ పార్టీలో వంగి వంగి ఉండాల్సిందే..అదీ కాక కాంగ్రెస్ పార్టీ తో జట్టు కట్టడానికి ఎవరో ఒక సీనియర్ నాయకుడి హస్తం ఉండాలి..మరి రేవంత్ వెనుకాల దాగున్న ఆ నాయకుడు ఎవరు..అయితే రేవంత్ కి తెలంగాణా ఫ్లోర్ లీడర్ జానారెడ్డి తో కూడా మంచి రిలేషన్ ఉంది. రేవంత్ రాకను.. స్వాగతిస్తున్న వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే పాత కొత్త సంగతుల్ని సరిపోల్చి చూసుకుంటే.. గతంలో ‘త్వరలో మా కాంగ్రెస్ కు ఓ బాహుబలి రాబోతున్నా’డంటూ జానారెడ్డి చెప్పిన మాటలు బహుశా రేవంత్ ను ఉద్దేశించే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.