వామ్మో... మోక్షం కోసం ఇంత దారుణంగా...

మామూలుగా పూర్వకాలంలో కొందరు మోక్షం పొందేందుకు గాను అడవులు, లేదా  పర్వత  ప్రాంతాలకోకి వెళ్లి  సుదీర్ఘ తపస్సులో మునిగిపోయేవారని అప్పుడప్పుడు కొందరు పెద్దలు చెబుతుంటారు.కానీ ఈ మోక్షం కోసం చేసేటటువంటి పనులు వారి యొక్క నమ్మకం మరియు ఆచారాలను బట్టి ఉంటాయి.

 Jain Community People Hair Removing With Hand For Moksha, Moksham News, Jain Com-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా జైన మతస్తులు మోక్షం పొందేందుకు గాను పాటించే ఆచారాలను గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

అయితే  జైన మతస్తులు మోక్షం పొందేందుకు గాను దాదాపుగా నలభై ఒక్క రోజుల పాటు కఠిన దీక్షను చేపడతారు.

 ఈ దీక్ష అనంతరం వారి యొక్క తలపై మరియు శరీరంపై ఉన్నటువంటి వెంట్రుకలను తమ చేతుల ద్వారానే తొలగించుకోవాలనే ఆచారం ఉంటుందట.  ఇలా చేసేముందు వారి యొక్క తలకి మరియు ఛాతిపై బూడిదను రాసుకుంటారని, ఇలా బూడిద ను రాసుకోవడం వల్ల వారికి ఇష్టమైన దైవ అనుగ్రహం కలుగుతుందని వారు నమ్ముతారట.

అయితే ఒక సారి దీక్ష చేపట్టిన వారు ప్రతి సంవత్సరం కొనసాగిస్తారని ఇలా చేయడం వల్ల వారికి దైవ మోక్షం కలగడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారని బలంగా నమ్ముతారు. అందువల్లనే ఈ దీక్ష చేపట్టడానికి ఇంత సాహసం చేస్తారని కూడా కొందరు చెబుతున్నారు.

ఇలాంటి ఆచారాలు, కట్టుబాట్లు భారతదేశంలో ఎంతో మంది పాటిస్తున్నారు. మరియు ఆచరిస్తున్నారు.

అయితే ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని ఓ గ్రామంలో దీపావళి పండుగ తర్వాతి రోజున గోవర్ధన పండుగను జరుపుకుంటారు.అయితే ఈ పండుగ వేడుకలలో భాగంగా అక్కడి ప్రజలు గోవులను పూలతో అలంకరించి వాటిని నడిపిస్తూ కింద పడుకొని వాటితో తొక్కించుకుంటారు.

 ఇలా చేయడం వల్ల వారి యొక్క దోషాలు తొలగిపోతాయని అంతేగాక జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారని వారి యొక్క నమ్మకం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube